త్వరలో ఎల్ఐసీ ఐపీవో రాబోతోంది. మార్కెట్ పరిస్థితులు, ధర పైన ఎల్ఐసీ ఐపీవో ఆధారపడి ఉంది. ఎల్ఐసీ ఐపీవో కోసం కోట్లాదిమంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ నుండి కొంత లిక్విడిటీ ఎల్ఐసీ ఐపీవోకు ముందు బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు. రాబోయే మూడు నాలుగు రోజుల్లో మార్కెట్లు ఎలా ప్రవర్తిస్తాయనే దాని పైన కూడా ఎల్ఐసీ ఐపీవో ఆధారపడి ఉంటుంది.
అదే విధంగా మార్కెట్ పరిస్థితులు కూడా ఎల్ఐసీ ఐపీవోపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. సానుకూలంగా కనిపిస్తే మార్కెట్ నుండి ఎల్ఐసీ ఐపీవో కోసం లిక్విడిటీ కొంత బయటకు పోవచ్చునని అంటున్నారు.

అందుకే అనుమతి
ఎల్ఐసీ ఐపీవో త్వరలో రానుంది. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ మార్గంలో 20 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(FDI)కు కేంద్రమంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలోని కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎల్ఐసీ షేర్లను ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్‌లలో నమోదు చేయడానికి ప్రభుత్వం ఇదివరకు అనుమతిచ్చింది.
ఈ మెగా ఐపీవోలో ఆసక్తి కలిగి విదేశీ ఇన్వెస్టర్లు పాల్గొనవచ్చు. అయితే ఎల్ఐసీ అటు బీమా కంపెనీ కిందకు లేదా ఇటు బీమా ఇంటర్మీడియటరీ కిందకు కానీ రాదు. విదేశీ పెట్టుబడులకు సంబంధించి ప్రస్తుత FDI విధానంలో ఎలాంటి నిర్దేష్ట నియమావళి లేదు. ప్రస్తుత FDI విధానం ప్రకారం ప్రభుత్వ అనుమతి మార్గంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులకు ఇరవై శాతం వరకు పరిమితి ఉంది.
ఇప్పుడు ఎల్ఐసీ, తదితర చట్టబద్ద కార్పోరేట్ సంస్థల్లో 20 శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంది. మూలధన సమీకరణ ప్రక్రియను సులభతరం చేసేందుకు, బీమా రంగంలోని ఇతర సంస్థల మాదిరి ఆటోమేటిక్ మార్గంలో FDIని ఎల్ఐసీలోకి కొంతమేర అనుమతిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రయోజనాలు
FDI విధానంలో ఈ సంస్కరణ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఎల్ఐసీ, ఇతర చట్టబద్ద కార్పోరేట్ సంస్థలలో విదేశీ పెట్టుబడులకు వెసులుబాటు కల్పిస్తుంది. ప్రభుత్వం నిర్దేశించుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యానికి చేరువయ్యేందుకు ఇది ఉపకరిస్తుంది. ఎఫ్‌డీఐ నిధులు మరింత రావడానికి, సులభతర వ్యాపారానికి ఇది ఉపయోగం.

రూ.63,000 కోట్లు
ప్రభుత్వం ఫిబ్రవరి 13వ తేదీన డ్రాఫ్ట్ పేపర్స్‌ను క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) వద్ద సమర్పించింది. ప్రభుత్వానికి పూర్తి శాతం వాటా ఉంది. ఇందులో 5 శాతం విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ విక్రయం ద్వారా రూ.63,000 కోట్లు వస్తాయని అంచనా.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications