LIC Investment: దేశంలోని అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారులు అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు ఎల్ఐసీ. వివిధ పాలసీలు, స్కీమ్స్ ద్వారా దేశంలోని ప్రజలు ఎల్ఐసీ వద్ద పెట్టిన డబ్బును సంస్థ పెట్టుబడులు పెడుతుంటుంది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ దిగ్గజం తన వాటాలను 10 కంపెనీల్లో పెంచుకుంది.

IRCTC స్టాక్..
సెప్టెంబర్ 30తో ముగిసిన మునుపటి త్రైమాసికంలో PSU టికెట్ బుకింగ్ & హాస్పిటాలిటీ కంపెనీ IRCTCలో ఎల్ఐసీ తన వాటాను 4.44 శాతం నుంచి Q3FY23లో 7.42 శాతానికి పెంచుకుంది. ఫిబ్రవరి 17, 2023న మార్కెట్ ధర రూ.649.80తో IRCTC మార్కెట్ క్యాప్ రూ.51,984 కోట్లుగా ఉంది.

వోల్టాస్..
ఇన్సూరెన్స్ మేజర్ డిసెంబర్ 31, 2022తో ముగిసిన త్రైమాసికంలో టాటాలకు చెందిన ఓల్టాస్ కంపెనీలో 9.88 శాతం ఈక్విటీ వాటాలను కలిగి ఉంది. అంతకు ముందు ఇదే త్రైమాసికంలో ఇది 8.24 శాతంగా ఉంది. దేశంలో అతిపెద్ద ఎయిర్ కండీషనర్ తయారీ కంపెనీల్లో ఒకటైన వోల్టాస్ స్టాక్ ధర రూ.854.6 వద్ద రూ.28,277 కోట్ల మార్కెట్ విలువను కలిగి ఉంది.

Mphasis..
సాఫ్ట్‌వేర్ డెవలపింగ్ కంపెనీ Mphasisలో ఎల్‌ఐసీ ప్రస్తుతం 3.66 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. గతంలో కంపెనీలో ఎల్ఐసీ కేవలం 2.1 శాతం వాటాలను కలిగి ఉంది. ప్రస్తుతం స్టాక్ ధర మార్కెట్లో రూ.2,236.30 వద్ద ఉంది. దీంతో ఎంఫాసిస్ మార్కెట్ క్యాప్ రూ.42,129 కోట్లుగా ఉంది.

టెక్ మహీంద్రా..
దేశీయ టెక్ కంపెనీల్లో ఒకటి ఆనంద్ మహీంద్రాకు చెందిన టెక్ మహీంద్రా. ఇటీవలి త్రైమాసికంలో LIC ఈ ఐటీ కంపెనీలో 7.44 శాతం వాటాలను కలిగి ఉంది. గతంలో పెట్టుబడులను గమనిస్తే ఈ పెట్టుబడులు కేవలం 5.96 శాతంగా మాత్రమే ఉన్నాయని వెల్లడైంది.

కాప్రి గ్లోబల్ క్యాపిటల్..
సెప్టెంబర్ 30, 2022 నాటికి LIC కాప్రి గ్లోబల్ క్యాపిటల్ కంపెనీలో 9.69 శాతం వాటాలను కలిగి ఉంది. దీనికి ముందు NBFCలో 8.25 శాతం వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం స్టాక్ ధర రూ.703.5 వద్ద ఉండటంతో మార్కెట్ క్యాప్ రూ.14,495 కోట్లుగా ఉంది.

ఇతర కంపెనీలు..
ఇదే సమయంలో ఎల్ఐసీ ఇతర కంపెనీల్లో కూడా తన పెట్టుబడులను గతంలో కంటే పెంచింది. ఫార్మా మేజర్ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌లో 8.95 శాతానికి పెట్టుబడిని పెంచింది. వెల్‌స్పన్ కార్ప్ కంపెనీలో 8 శాతం, దీపక్ నైట్రేట్ కంపెనీలో 6.44 శాతం, గెయిల్ ఇండియాలో 7.01 శాతం, HDFC AMCలో వాటాలను 9.12 శాతానికి పెంచింది.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications