నూతనంగా గృహాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ .50 లక్షల వరకు గృహ రుణాలకు వడ్డీ రేట్లను 6.66 శాతానికి తగ్గించినట్లు ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది. సవరించిన రేట్లు, ఆగస్టు 31, 2021 వరకు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది.

మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేసుకునే గొప్ప ఆఫర్
ఇదే సమయంలో వడ్డీ రేటు రుణగ్రహీత యొక్క క్రెడిట్ యోగ్యతతో ముడిపడి ఉంటుందని , ఇది వారి సిబిల్ స్కోర్‌ల ద్వారా ప్రతిబింబిస్తుందని వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో దెబ్బతిన్న మధ్యతరగతి ప్రజలకు నూతన గృహాలను కొనుగోలు శక్తి పెంపొందించడంలో సహాయపడే వడ్డీ రేటును అందించాలని భావించామని సంస్థ వెల్లడించింది. స్వంత ఇంటిని సొంతం చేసుకోవాలనే వారి కలను నెరవేర్చడానికి ఎక్కువ మంది వ్యక్తులకు సహాయపడాలని తాము కోరుకున్నామని సంస్థ వెల్లడించింది.

6.66 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలు
గృహ రుణ వడ్డీ రేటులో ఈ తగ్గింపు మరింత పెరుగుతుందని తాము ఆశిస్తున్నామని పేర్కొంది. కస్టమర్ విశ్వాసం, ఈ రంగం యొక్క పునరుజ్జీవనం కోసం ఎంతగానో ఇది ఎంతగానో సహాయం చేస్తుందని అని దాని మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ వై విశ్వనాథ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.6.66 శాతం వద్ద, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ గరిష్టంగా 30 సంవత్సరాల కాలపరిమితితో గృహ రుణాలపై తన వడ్డీ రేటును అందిస్తుంది. రుణదాతలు ఆన్లైన్ ద్వారా కూడా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని , ఆన్‌లైన్‌లోనే ఆమోదాలు పొందవచ్చని తెలిపింది.

ఆన్ లైన్ ద్వారానే గృహ రుణాలు మంజూరు
ఎల్‌ఐసి హెచ్‌ఎఫ్‌ఎల్ కార్యాలయాలను సందర్శించకుండా వినియోగదారులు తమ రుణ దరఖాస్తులను ట్రాక్ చేయవచ్చునని పేర్కొంది. అతి తక్కువ వడ్డీ రేటు యేసుని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లో గృహ రుణాలు తీసుకుని సొంతింటి కల సాకారం చేసుకోవాలని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వినియోగదారులను కోరుతోంది. మరెందుకాలస్యం అతి తక్కువ వడ్డీ రేట్ కి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి.


Click it and Unblock the Notifications