ATV Projects India Stock: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇటీవలి కాలంలో గతంలో ఎన్నడూ చూడని పరివర్తనను చూస్తున్నాయి. ఈ క్రమంలో ఉదయం లాభాల్లో ఉన్నప్పటికీ గంటల్లోనే నష్టాల్లోకి జారుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైతం కొన్ని కంపెనీల షేర్లు మాత్రం నిరంతరాయంగా తమ పెట్టుబడిదారులకు రాబడులను అందిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ATV ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. ఈ కంపెనీ తన పెట్టుబడిదారులకు ఇటీవలి సంవత్సరాల్లో అద్భుతమైన మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. ప్రధానంగా ఈ కంపెనీలో భారతీయ ప్రభుత్వ యాజమాన్యంలోని ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ భారీగా వాటాలను హోల్డ్ చేస్తుంది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లపై బెట్టింగ్ వేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. నిన్న ట్రేడింగ్ ముగింపు సమయానికి కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.32.50 రేటు వద్ద ప్రయాణాన్ని ముగించాయి. 2024లో ఇప్పటి వరకు కంపెనీ తన పెట్టుబడిదారులకు 100 శాతానికి పైగా రాబడిని అందించి వారి పెట్టుబడిని డబుల్ చేసింది.

వాస్తవానికి దీర్ఘకాలికంగా కంపెనీ షేర్లను హోల్డ్ చేసిన ఇన్వెస్టర్లు మంచి రాబడులను అందుకున్నారని తేలింది. 5 ఏళ్ల కింద ఒక్కో షేరు ధర కేవలం రూ.4 స్థాయి వద్ద ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అది రూ.32.50కి పెరిగింది. అంటే ఈ కాలంలో పెట్టుబడిదారులు సరాసరిన 700 శాతానికి పైగా రాబడిని అందుకున్నారు. అయితే గడచిన నెల రోజుల్లో మాత్రం స్టాక్ 10 శాతం ధర క్షీణతను చూసింది. వాస్తవానికి దేశీయ స్టాక్ మార్కెట్లు బేరిష్ మెుమెంటం కలిగి ఉన్న వేళ ఈ పెన్నీ మల్టీబ్యాగర్ స్టాక్ సైతం ప్రభావితం అయ్యింది. అలాగే ఆరు నెలల కాలంలో పెట్టుబడిదారులకు స్టాక్ 35 శాతం రాబడులను అందించింది. ఈ క్రమంలో ఒక్కో షేరు ధర రూ.23.90 స్థాయి నుంచి ప్రస్తుత రేటుకు పెరిగింది. అలాగే ఏడాది ప్రాతిపగికన 125 శాతం రాబడిని ఇన్వెస్టర్లు పొందారు. గురువారం మార్కెట్ల ముగింపు సమయంలో కంపెనీ మార్కెట్ క్యాప్ బీఎస్ఈలో రూ.172 కోట్లుగా ఉంది.
2023 చివరి నాటికి కంపెనీ షేర్లలో ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ షేర్లలో లక్ష పెట్టుబడి పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని విలువ రూ.2.10 లక్షలకు చేరుకుని ఉండేది. అలాగే 5 ఏళ్ల కిందట ఇదే కంపెనీ షేర్లలో లక్ష ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులకు ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ రూ.8 లక్షలకు చేరుకుని ఉండేది. ఇక్కడ చాలా మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్న విషయం బీమా దిగ్గజం కంపెనీలో భారీగా వాటాలను హోల్డ్ చేయటమే. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ATV ప్రాజెక్ట్స్ ఇండియా లిమిటెడ్ షేర్ హోల్డింగ్ జాబితాలో కొనసాగుతున్న ఎల్ఐసీకి కంపెనీలో ఏకంగా 9,95,241 కంపెనీ షేర్లను కలిగి ఉంది. ఇది మెుత్తం కంపెనీ షేర్లలో దాదాపు 1.87 శాతానికి సమానమైనది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications