GTL Infrastructure Share: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న మెగా ర్యాలీ చిన్న కంపెనీల షేర్లను సైతం రాకెట్ వేగంతో పెరిగేలా చేస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్ల డబ్బు భారీగా మార్కెట్లోకి వస్తుండటం కంపెనీల వ్యాల్యుయేషన్లను అమాంతం పెంచేస్తోంది. ఈ క్రమంలో ఎల్ఐసీ ఇన్వెస్ట్ చేసిన స్టాక్ మార్కెట్లో అందరి దృష్టిని ప్రస్తుతం ఆకర్షిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబుతున్నది జీటీఎస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. పెన్నీ స్టాక్ ధర శుక్రవారం మార్కెట్లు ముగింపు సమయానికి 4.72 శాతం క్షీణించి రూ.3.03 ధర వద్ద బీఎస్ఈలో స్థిరపడ్డాయి. అదే సమయంలో ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్లు 5.13 శాతం క్షీణతతో రూ.2.96 ధర వద్ద ముగిశాయి. టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో పనిచేస్తున్న కంపెనీ షేర్లు ఏడాది ప్రాతిపదికన 122.8 శాతం భారీ రాబడిని పెట్టుబడిదారులకు అందించింది.

ఈ చిన్న కంపెనీ షేర్లలో భారత ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 3.33% వాటాను హోల్డ్ చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీకి చెందిన 42,6177058 షేర్లను కలిగి ఉంది. ఈ సంస్థలో ఎల్‌ఐసీ మాత్రమే కాకుండా అనేక పెద్ద ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులు వాటాలను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12.07%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.36%, బ్యాంక్ ఆఫ్ బరోడా 5.68%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 5.23%, కెనరా బ్యాంక్ 4.05%, ICICI బ్యాంక్ 3.33% వాటాలను కలిగి ఉన్నాయి.
GTL ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుత మార్కెట్ ధర ఒక్కో షేరుకు రూ.2.96గా ఉన్నాయి. 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.4.33 నుంచి 31.63 శాతం పడిపోయింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3880 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ వ్యాపారం గురించి పరిశీలిస్తే.. టెలికాం టవర్లు, వైర్‌లెస్ టెలికాం ఆపరేటర్లు పంచుకునే కమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుతో పాటు నిర్వహణ చేపడుతుంది. దేశంలోని మొత్తం 22 టెలికాం సర్కిల్‌లలో కంపెనీ సుమారు 26,000 టవర్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications