For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

LIC: బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో టాప్ బ్రాండ్‍గా ఎల్ఐసీ.. అందులో ఐటీసీ టాప్..

|

భారతదేశంలో బలమైన టెలికాం బ్రాండ్ గా ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో మొదటి స్థానంలో నిలిచింది. భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా సంస్థలు ఆ తర్వాత స్థానాల్లో నిల్చాయి. TRA (ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ) ఇండియాస్ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్స్ 2022'లో కంపెనీలకు వారి బ్రాండ్ బలం ప్రకారం ర్యాంక్ లు ఇచ్చింది. టెలికాం విభాగంలో రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్, బీఎస్ఎన్ఎల్ ఉన్నాయి.

అడిడాస్

అడిడాస్

దుస్తులు విభాగంలో అడిడాస్ అగ్ర బ్రాండ్‌గా ఉంది. తర్వాత నైక్, రేమండ్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్ ఉన్నాయి. ఆటోమొబైల్ జాబితాలో BMW అగ్రస్థానంలో ఉంది. తరువాత టయోటా, హ్యుందాయ్, హోండా ఉన్నాయి. అయితే LIC బ్యాంకింగ్, ఆర్థిక సేవల సూచికలో 1 స్థానంలో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2వ స్థానంలో ఉండగా.. ICICI బ్యాంక్ 3వ స్థానంలో ఉంది.

LG

LG

వినియోగదారు ఉపకరణాల ర్యాంకింగ్‌లో కెంట్ అగ్రస్థానంలో ఉండగా, లివ్‌పుర్, ఒకాయ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌లో LG, Sony, Samsungలు మొదటి మూడు బ్రాండ్‌లుగా ఉన్నాయి. విభిన్న సమ్మేళనాల జాబితాలో ఐటీసీ అగ్రస్థానంలో ఉండగా, టాటా, రిలయన్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎనర్జీ విభాగంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) అగ్రస్థానంలో ఉండగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), అదానీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

అమూల్

అమూల్

ఆహారం, పానీయాల విభాగంలో, అమూల్ అగ్ర బ్రాండ్, నెస్కేఫ్ తర్వాత ఫాగ్ టాప్ FMCG బ్రాండ్, లాక్మే, నివియా, కోల్గేట్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ జాబితాలో ఫిలిప్స్, గాడ్జెట్రీ లిస్ట్‌లో Mi, హెల్త్‌కేర్‌లో హిమాలయా, హాస్పిటాలిటీలో ఐటీసీ హోటల్స్, మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఏసీసీ, రిటైల్‌లో కేఎఫ్‌సీ, టెక్నాలజీలో డెల్ అగ్రస్థానంలో ఉన్నాయి. అమెజాన్, ఫేస్‌బుక్, ఫ్లిప్‌కార్ట్, గూగుల్ ఇంటర్నెట్ బ్రాండ్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.

English summary

LIC: బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో టాప్ బ్రాండ్‍గా ఎల్ఐసీ.. అందులో ఐటీసీ టాప్.. | LIC has emerged as the top brand in banking and financial services, while ITC has emerged as the top brand in the list of various conglomerates.

Adidas is the leading brand in the apparel segment. Then there is Nike, Raymond, Allen Solly, Peter England.
Story first published: Monday, November 14, 2022, 17:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X