LIC: పన్ను వ్యవహారాల్లో అవకతవకలను సంబంధిత అధికారులు ఇప్పుడు ఏ మాత్రం సహించడం లేదు. నోటీసులు ఇచ్చి మరీ చెల్లించాల్సిన మొత్తాన్ని రాబడుతున్నారు. ఆదాయపు పన్ను, GST విభాగాలు ఈ వ్యవహారంలో కఠిన వైఖరి అవలంభిస్తున్నాయి. బడా బాబుల దగ్గర నుంచి దిగ్గజ కార్పొరేట్ సంస్థల వరకు ఎవరినీ వదలడం లేదు. ప్రభుత్వ యాజమాన్యంలోని LICకి కూడా తాజాగా ఈ పన్నుపోటు తగిలింది.
తెలంగాణకు చెందిన ట్యాక్సేషన్ అథారిటీ నుంచి LIC డిసెంబర్ 11న GST నోటీసు అందుకుంది. వస్తు సేవల పన్ను, పెనాల్టీ సహా వడ్డీతో కలిపి మొత్తం 183 కోట్ల మేర ట్యాక్స్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం అందులో పేర్కొంది. ఈ డిమాండ్ ఆర్డర్-కమ్-పెనాల్టీ నోటీసు 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినదని LIC తెలిపింది.

పెండింగ్‌లో ఉన్న GST బకాయిల రూపంలో 81.2 కోట్లు, పెనాల్టీగా 93.2 కోట్లు, 8.1 కోట్లు వడ్డీతో కలిపి చెల్లించాలని నోటీసులో కోరినట్లు బీమా సంస్థ వెల్లడింంచింది. రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద తక్కువ చెల్లింపులు మరియు ఎక్స్‌సెస్ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయడంతో ఈ ఛార్జ్ చేయబడినట్లు పేర్కొంది.
అప్పిలేట్ జాయింట్ కమీషనర్, హైదరాబాద్ రూరల్ డివిజన్ ముందు ఈ ఆర్డర్‌ను LIC సవాలు చేయవచ్చు. స్టాక్ ఎక్స్ఛేంజీలకు విషయాన్ని తెలియజేయడానికి ముందే ఈ పని చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన GST నోటీసు.. సంస్థ ఆర్థిక, సాధారణ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications