LIC notice: టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఆర్ధిక మోసాలు కూడా అదే రీతిలో పెరిగాయి. వీటి వల్ల ఎక్కువగా మోసపోయేది కూడా సామాన్యులే. ప్రస్తుతం నేటి ప్రపంచంలో ఎన్నో రకాల మోసాలు ఎక్కడో ఓ చోట జరుగునే ఉన్నాయి, దీనివల్ల ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు రెండు నిమిషాల్లో మాయమవుతుంది. తాజాగా దినికి సంబంధించి LIC కూడా మోసపూరితమైన యాప్(fake apps)ల గురించి ప్రజలను హెచ్చరించింది.
LIC జారీ చేసిన నోటీసు
LIC ఇండియా యాప్ అని చూపించే ఫేక్ యాప్‌ను మీరు ఉపయోగిస్తే లేదా చుసిన తమకు సమాచారం అందజేయాలని LIC ఇటీవల నోటీసు జారీ చేసింది, LIC పేరుతో కనిపించే ఇలాంటి యాప్ నిజం కాదు. దీని వల్ల మీ డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. ఈ కారణంగా ఇలాంటి మొబైల్ యాప్‌ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాము. దీనితో పాటు మీ అన్ని ట్రాన్సక్షన్ LIC అఫీషియల్ వెబ్‌సైట్ సహాయంతో మాత్రమే చేయాలని లేదా డబ్బును LIC డిజిటల్ యాప్ ద్వారా ట్రాన్సక్షన్ చేయాలని కూడా తెలియజేసింది.

LIC గతంలో కూడా నోటీసు జారీ
గత ఏడాది సెప్టెంబర్‌లో కూడా LIC ఒక నోటీసు జారీ చేసింది. LIC పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్ పూర్తిగా నకిలీదని పేర్కొంది. LIC ఎటువంటి మెసేజ్ ద్వారా ఎలాంటి ఉత్తర్వులను జారీ చేయలేదు. అన్ని బీమా ఉత్పత్తులు లేదా ప్లాన్స్ ఇన్సూరెన్స్ ఉపసంహరించుకుంటున్నట్లు వస్తున్న మెసేజెస్ వాదన కూడా పూర్తిగా అబద్ధమని PIB ఫ్యాక్ట్ చెక్ చెబుతోంది. వాస్తవానికి LIC ఇలాంటి మెసేజెస్ చేయదు.
ఇది కాకుండా, బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒ మెసేజ్లో KYC వెరిఫికేషన్ కరణ గురించి కస్టమర్లను అప్రమత్తం చేసింది. LIC కస్టమర్లు వెంటనే KYCని అప్‌డేట్ చేయాలని మెసేజెస్ వస్తున్నాయి. ఇందులో ఇచ్చిన లింక్ ద్వారా వెంటనే KYC అప్ డేట్ చేయాలని సూచిస్తుంది. అయితే ఇలాంటి మెసేజెస్ ఫేక్ అని వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని LIC సమాచారం ఇచ్చింది.
గతంలో కూడా ఎల్ఐసి పాలసీలపై ఎక్కువ రాబడిని ఇస్తామని హామీ ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న ఒక ఫేక్ కాల్ సెంటర్‌ను పూణే పోలీసులు పట్టుకున్నారు. నిందితులు LIC గుర్తింపు కార్డులను నకిలీ చేసి, నకిలీ కంపెనీ స్టాంపులను ఉపయోగించి అనుమానం లేకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. అరెస్టయిన వ్యక్తులలో ఒకరు గతంలో LIC పాలసీ జారీలో పనిచేశారు ఇంకా కస్టమర్ డేటాను చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేశారు. ఈ డేటాను ఉపయోగించి ప్రజలను సంప్రదించి వారిని స్కామ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications