ఎల్ఐసీ వ్యాల్యూ ఎంతంటే, అధికారికంగా బయటకు: రిలయన్స్, టీసీఎస్ స్థాయికి...
త్వరలో ఐపీవోకు రానున్న లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) వ్యాల్యూ రూ.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందని దీపమ్ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే అన్నారు. ఎంటర్‌ప్రైజెస్ వ్యాల్యూ పై వ్యాల్యూ కంటే కొన్ని రెట్లు ఉంటుందన్నారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎల్ఐసీ మెగా ఐపీవోకు అడుగులు వేగంగా కదులుతున్నాయి. అతి త్వరలో సెబికి ముసాయిదా పత్రాలను దాఖలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ వ్యాల్యూను ఎంతగా పరిగణించారనే అంశం ఆసక్తికరం.

మొదటిసారి...
ఎల్ఐసీ వ్యాల్యూ తొలిసారి స్పందించారు. ఈ బీమా సంస్థ వ్యాల్యూ 53 బిలియన్ డాలర్ల నుండి 150 బిలియన్ డాలర్ల మధ్య అంటే దాదాపు రూ.4 లక్షల కోట్ల నుండి రూ.11 లక్షల కోట్లకు పైగా ఉంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా తొలిసారి గురువారం స్పందించారు. దాదాపు రూ.5 లక్షల కోట్లు లైదా 66.6 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేశారు. బీమా కంపెనీలకు స్టాటిస్టికల్, ఇతర సర్వీసులు అందించే మిల్లీమాన్ అడ్వయిజర్స్ ఎల్ఎల్‌పీ ఈ సంస్థ వ్యాల్యూను లెక్కించిందని తుహిన్ కాంత పాండే తెలిపారు.

టాప్ 5 కంపెనీల్లో...
ఎల్ఐసీ ఐపీవోకు వచ్చాక ఒకేసారి రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ చెంతన చేరుతుందని భావిస్తున్నారు. ఎల్ఐసీ ఎంబడెడ్ వ్యాల్యూ రూ.5 లక్షల కోట్లను మించుతుందని, మార్కెట్ వ్యాల్యూ అంతకంటే భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఎంబడెడ్ వ్యాల్యూను నిర్ధారించిన అంశాలను నివేదికలో పరిశీలించిన తర్వాత ఏ ధరకు ఇష్యూ జారీ చేయాలో నిర్ణయిస్తారు.
బీమా కంపెనీల మార్కెట్ వ్యాల్యూ ఎంబడెడ్ వ్యాల్యూ మూడు నాలుగు రెట్లు ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఎల్ఐసీలో 5 శాతం వాటా విక్రయం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.90వేల కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది. రూ.15 లక్షలకు పైగా మార్కెట్ వ్యాల్యూ ఆధారంగా ఐపీవోలో ధరను నిర్ణయిస్తే, అది విజయవంతమైతే టాప్ 5 కంపెనీల్లో ఒకటిగా నిలుస్తుంది. ఎల్ఐసీకి మూలధన అవసరం లేదు.
అది ప్రైమరీ మార్కెట్లో తాజా షేర్లు, జారీ చేయకపోవచ్చునని, మొత్తం సెకండరీ మార్కెట్లలోనే జారీ చేయవచ్చునని తుహిన్ కాంత పాండే అన్నారు. చట్ట ప్రకారం ఎల్ఐసీలో ప్రభుత్వ వాటా 51 శాతానికి తగ్గవద్దు.

మార్చిలో ఐపీవోకు
ఎల్ఐసీ ఐపీవో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది మార్చి నెలలో రావొచ్చునని అంచనాలు ఉన్నాయి. ఎల్ఐసీ ఐపీవోలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేందుకు వీలుగా FDI పాలసీలో చేపట్టిన మార్పులకు ఆమోదాన్ని కోరుతూ ఓ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు ఉంచనున్నట్లు డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు.


Click it and Unblock the Notifications