లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) గత మార్చితో ముగిసిన చివరి ఆర్థిక సంవత్సరం (2020-21)లో ప్రభుత్వానికి ఎలాంటి డివిడెండ్ అందించలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాడ్ రాజ్యసభలో తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇన్సురెన్స్ కంపెనీల డివిడెండ్ చెల్లింపులపై ఆంక్షలు విధించడం ఇందుకు కారణమని తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ తన లాభాల నుండి ప్రభుత్వానికి రూ.2,610 కోట్లను డివిడెండ్‌గా చెల్లించింది. కానీ 2020-21లో రిజర్వ్ నిధులతో ఎల్ఐసీ తన పెయిడప్ ఈక్విటీ మూలధనాన్ని రూ.6,325 కోట్లకు పెంచుతుందన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఎల్ఐసీ ఐపీవోకు రానుంది. రెండేళ్ల క్రితం డివిడెండ్ చెల్లించినప్పటికీ, 2020 మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లాభాల నుండి డివిడెండ్ చెల్లింపులకు దూరంగా ఉండాలని ఐఆర్‌డీఏఐ బీమా సంస్థలను ఆదేశించినట్లుగా భగవత్ కరాడ్ తెలిపారు. కరోనా నేపథ్యంలో కంపెనీలు ఆకస్మిక పరిస్థితులను తట్టుకునేందుకు వీలుగా మూలధనాన్ని ఉంచుకోవాలని ఐఆర్‌డీఏఐ బీమా సంస్థలకు సూచించింది.

ఈ నెలల్లోనే ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను సెబీ వద్ద దాఖలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2022 జనవరి 1 నుండి రూ.10,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్లు, పొదుపు, ఇతర ఖాతాల నుండి రూ.25,000 నగదు ఉపసంహరణకు సంబంధించిన ఛార్జీల్లో ఎలాంటి సవరణలు చేయలేదని ప్రభుత్వ, ప్రయివేటురంగ బ్యాంకులు తెలిపాయని వెల్లడించారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications