LIC customer alert: వాటిపట్ల జాగ్రత్త... ఎల్ఐసీ కస్టమర్లకు అలర్ట్

లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) తన కస్టమర్లకు అలర్ట్ చేసింది. ఎల్ఐసీ పేరుతో వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎల్ఐసీ లోగోను చూపిస్తూ, ఆకర్షణీయ రాబడుల ప్రతిపాదనలతో వల వేసే విశ్వసనీయం కానీ సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. విశ్వసనీయం కాని సంస్థలు ఎల్ఐసీ లోగోను దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

సోషల్ మీడియా సంస్ధలు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎల్ఐసీ లోగోను చూపిస్తూ విశ్వసనీయం కాని సంస్థలు ఇచ్చే ప్రకటనలు, ప్రతిపాదనలకి ఆకర్షితులు కావొద్దని పేర్కొంది. గుర్తు తెలియని పలు సంస్థలు, ఏజెంట్లు కొన్ని వెబ్ సైట్లను, యాప్స్‌ను సృష్టించి బీమా, బీమా సలహా సేవలను ఎల్ఐసీ ట్రేడ్ మార్కు పేరుతో ఆఫర్ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.

LIC customer alert: Do not believe seeing the logo, otherwise there will be a big loss

డేటాను చోరీ చేసే ఉద్దేశ్యంతో సాఫ్టువేర్, యాప్స్ సాయంతో అనధికారికంగా ఎల్ఐసీ పోర్టల్‌కు అనుసంధానం కల్పిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపింది. బీమా మార్కెట్‌లో ఎల్ఐసీ వాటా 68 శాతంగా ఉంది. ఎల్ఐసీ బెస్ట్ ఇన్సురెన్స్ ప్లాన్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఎల్ఐసీ త్వరలో ఐపీవోకు కూడా రానుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+