LIC: దేశవ్యాప్తంగా బీమా సేవలు అందిస్తున్న దిగ్గజ సంస్థ LIC. అతిపెద్ద పెట్టుబడిదారుగానూ వ్యవహరిస్తోంది. పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి భారీగా లాభాలు ఆర్జిస్తోంది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దాదాపు 65.50 వేల కోట్లకు పైగా లాభాన్ని సాధించింది. LIC పోర్ట్ ఫోలియోలో టాప్ 10 లిస్టెడ్ కంపెనీలే దాదాపు 50 శాతం ఉన్నాయి.
పరస్పరం విరుద్ధమైన పెట్టుబడి విధానాన్ని LIC అనుసరిస్తోందని ముంబైకి చెందిన ఓ ప్రముఖ మార్కెట్ విశ్లేషకుడు తెలిపారు. తద్వారా క్షీణతలోనూ లాభాలను నమోదు చేయగల సత్తా సొంతం చేసుకున్నట్లు వెల్లడించారు. చాలా మంది ఫండ్ మేనేజర్లు ఈ విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ పతనమైన వేళ షేర్లను సేకరించి, పెరిగినప్పుడల్లా లాభాలను బుక్ చేసుకోవడమే LIC స్ట్రాటజీ అని చెప్పారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ITC లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, ICICI బ్యాంక్ లిమిటెడ్, ఇన్ఫోసిస్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లార్సెన్ & టర్బో, HDFC బ్యాంక్ లిమిటెడ్, HDFC వంటి దిగ్గజ సంస్థల్లో పెట్టుబడి ద్వారా.. గణనీయంగా LIC లాభపడిందని ప్రముఖ మీడియా సంస్థ విశ్లేషించింది. వీటన్నిటిలో LIC హోల్డింగ్ మొత్తం విలువ 4.65 ట్రిలియన్లు కాగా.. తన మొత్తం ఇన్వెస్ట్ మెంట్ 9 ట్రిలియన్లు అని అంచనా.
ఈ ఆర్థిక ఏడాదిలోనూ మార్కెట్‌లలో రికార్డు స్థాయిలో 2.4 ట్రిలియన్ పెట్టుబడి పెట్టాలని LIC యోచిస్తోంది. దీనిని కేవలం అతిపెద్ద ఇన్వెస్ట్ మెంట్ గా మాత్రమే కాకుండా, పాలసీదారులకు గరిష్ఠ రాబడిని అందించడంలో మరో ముందడుగుగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే తన పెట్టుబడుల ద్వారా సాదించిన లాభాలను.. మార్కెట్-లింక్డ్ పాలసీ హోల్డర్లకు బోనస్ గా, ప్రభుత్వంతో సహా ఇతర వాటాదారులకు డివిడెండ్ రూపంలో చెల్లించడానికి LIC వినియోగిస్తుంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications