LIC News: ప్రైవేట్ కంపెనీ కొనుగోలులో తనమునకలైన LIC.. ఫేక్ వార్తలపై కంపెనీ క్లారిటీ..
Insurance News: భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) కేంద్ర ప్రభుత్వానికి బంగారు బాతులా మారింది. భారీ డివిడెండ్ ఇస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు జీవిత బీమాకి మాత్రమే పరిమితమైన సంస్థ.. ఇతర విభాగాల్లోకి సైతం ప్రవేశించాలని భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా కీలక స్టెప్ వేసినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ఇన్స్యూరెన్స్ దిగ్గజం LIC ఓ ప్రైవేట్ బీమా కంపెనీని కొనుగోలు చేయనున్నట్లు మార్కెట్లో బజ్ నెలకొంది. తద్వారా ఆరోగ్య బీమా మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై సదరు సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రతిపాదన తమ వద్ద లేదని స్పష్టం చేసింది. భవిష్యత్తు వృద్ధి కోసం పలు వ్యూహాత్మక అంశాలను విశ్లేషిస్తున్నట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

LIC పెట్టుబడుల అన్వేషణ గురించి సంస్థ ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి వ్యాఖ్యానించిన కొద్ది రోజుల తర్వాత బయటకు వచ్చిన ఈ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశంలోని 5 ప్రైవేట్ హెల్త్ ఇన్స్సూరెన్స్ కంపెనీల్లో ఒకదానిని కొనుగోలు చేసేందుకు LIC చురుకుగా ప్రయత్నిస్తోందన్న వార్తలతో శుక్రవారం కంపెనీ షేర్లు 6 శాతానికి పెరిగాయి. 1,007 వద్ద ప్రారంభమై 1,067 వరకు చేరాయి.
ఆరోగ్య బీమా రంగంలో వృద్ధి చెందేందుకు మార్గాలను అన్వేషిస్తున్నట్లు, దీనికోసం అంతర్గతంగా పని జరుగుతోందని మే 28 కంపెనీ ఛైర్మన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. IRDAI ప్రస్తుత చట్టాల ప్రకారం ఒక బీమా సంస్థ కింద జీవిత, జనరల్ లేదా ఆరోగ్య బీమా సేవలు అందించేందుకు కాంపోజిట్ లైసెన్సింగ్‌ను అనుమతించదు. కాబట్టి LIC హెల్త్ సెక్టార్‌లో ప్రవేసించాలంటే ప్రస్తుతం ఉన్న బీమా చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications