Credit Cards: దేశంలో అతిపెద్ద బీమా సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న ఎల్ఐసీ తాజాగా క్రెడిట్ కార్డుల రంగంలోకి ప్రవేశించింది. తన కస్టమర్లకు ప్రయోజనాలను కలిగించేందుకు ఇది వీలు కలిగిస్తుందని కంపెనీ పేర్కొంది.
తాజాగా ఎల్ఐసీ ఎల్ఐసీ క్లాసిక్, ఎల్ఐసీ, సెలెక్ట్ అనే రెండు వేరియంట్లలో కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను లాంచ్ చేసింది. ఈ విషయాన్ని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎల్ఐసీ కార్డ్స్, మాస్టర్ కార్డ్స్ సంయుక్తంగా గురువారం ప్రకటించాయి. దేశంలో మారుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్డులు దేశవ్యాప్తంగా ఉన్న 27 కోట్ల మంది పాలసీదారులకు ప్రతి LIC బీమా ప్రీమియం చెల్లింపుపై రివార్డ్ పాయింట్ల రూపంలో ప్రయోజనాలను అందిస్తాయని స్పష్టం చేశారు.

ప్రయోజనాలను చూస్తే ఇది లాస్ట్ కార్డ్ లయబిలిటీ కింద రూ.50,000 , రూ.5 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీతో సహా ఇతర ప్రయోజనాలను సైతం అందిస్తున్నాయి. తమ విలువైన కస్టమర్‌లకు అత్యుత్తమ సేవలను అందించాలనే నిబద్ధతను ఈ భాగస్వామ్యం సూచిస్తుందని LIC కార్డ్స్ చైర్మన్ సిద్ధార్థ మొహంతి పేర్కొన్నారు. న్యూ ఏజ్ కస్టమర్లకు ఇది చక్కటి అనుభవాన్ని అందిస్తుందని ఎల్ఐసీ అభిప్రాయపడుతోంది.
కార్డ్‌లోని రెండు వేరియంట్‌లు ఎయిర్ పోర్ట్స్, రైల్వే స్టేషన్‌లలో లాంజ్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ సౌకర్యాన్ని సైతం ఆఫర్ చేస్తున్నాయి. అలాగే ఆర్థిక రక్షణ కోసం వ్యక్తిగత ప్రమాద బీమా వంటి వివిధ రక్షణ సౌకర్యాలను కార్డులు అందిస్తూ ఆకర్షనీయంగా మారాయి.


Click it and Unblock the Notifications