Multibagger Stocks: LIC పెట్టుబడులు పెట్టిన మల్టీబ్యాగర్.. ఏడాదిలో సూపర్ లాభాలు
Multibagger Stocks: ఇటీవలి కాలంలో మల్టీబ్యాగర్ స్టాక్స్ ఒకటి తర్వాత మరొకటి బయటకు వస్తున్నాయి. ఇన్వెస్టర్లను సంపన్నులుగా మార్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టిన కంపెనీ కూడా ఇన్వెస్టర్లకు స్వల్ప కాలంలో మంచి రాబడులను అందించింది.
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కంపెనీ గురించే. ఈ స్టాక్ ఏడాది కాలంలోనే తన ఇన్వెస్టర్లకు సూపర్ లాభాలను అందించింది. ఈ క్రమంలో స్టాక్ ధర రూ.68.50 స్థాయి నుంచి రూ.127కి పెరిగింది. అంటే YTD ప్రాతిపధికన దాదాపు 85 శాతం లాభపడింది. ఈ కంపెనీలో ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసీకి దాదాపు 6.38 శాతం వాటాలు ఉన్నాయి.
ఆర్వీఎన్ఎల్ షేర్ ధర గత నెలలో రూ.72.75 నుంచి రూ.126.35 స్థాయికి పెరిగాయి. ఎన్ఎస్ఈలో ఈ క్రమంలో స్టాక్ దాదాపు 70 శాతం మేర పెరిగింది. అలాగే ఆరు నెలల కాలాన్ని పరిశీలిస్తే స్టాక్ ధర రూ.55 నుంచి రూ.126.35 స్థాయికి పెరిగి ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ అందాయి.

ఎవరైనా ఇన్వెస్టర్ 5 ఏళ్ల కిందట దీర్ఘకాలిక పెట్టుబడి ఆలోచనతో కంపెనీలో షేర్లను రూ.19.75 ధర స్థాయిలో లక్ష రూపాయలతో కొనుగోలు చేసి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వారి పెట్టుబడి విలువ రూ.6.4 లక్షలకు చేరుకుని ఉండేది. ఈ క్రమంలో స్టాక్ ఆరు రెట్ల కంటే ఎక్కువ రాబడిని అందించింది. అలాగే ఎవరైనా ఇన్వెస్టర్ నెల రోజుల కిందట షేర్లలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే ఇప్పుడు దాని విలువ రూ.1.70 లక్షలుగా అయి ఉండేది.
Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.


Click it and Unblock the Notifications