Bonus Shares: ఉచిత షేర్లు అందిస్తున్న ఎల్ఐసీ స్టాక్.. రికార్డు డేట్ ఫిక్స్..
LIC News: తక్కువ కాలంలోనే పెట్టుబడికి మంచి రాబడిని పొందాలనుకునే వారు ఎక్కువగా బోనస్ షేర్లను అందించే కంపెనీల్లో తాత్కాలికంగా పెట్టుబడి పెడుతుంటారు. ఈ క్రమంలోనే ఎల్ఐసీ పెన్నీ స్టాక్ ఒకటి సదవకాశాన్ని అందిస్తోంది.
ఇంటెగ్రా ఎసెన్షియా లిమిటెడ్ షేర్లు ఐపీవో గణనీయమైన వాటాను కలిగి ఉన్న పెన్నీ స్టాక్ బోనస్ షేర్లను అందిస్తోంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు జనవరి 11,2024న బోనస్ షేర్లను జారీ చేయడానికి రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. స్మాల్ క్యాప్ కంపెనీ ఇప్పటికే అర్హులైన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీ చేయనున్నట్లు వెల్లడించింది. అంటే రికార్డు తేదీకి ముందు కంపెనీలో వాటాలు కలిగి ఉన్న ఇన్వెస్టర్లు మాత్రమే ప్రయోజనాన్ని పొందుతారు. ఈ పెన్నీ స్టాక్‌లో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఏకంగా 1.06 శాతం వాటాను కలిగి ఉంది.

నవంబర్ 27, 2023 సోమవారం జరిగిన సమావేశంలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు బోనస్ ఇష్యూని సిఫార్సు మేరకు ఒక్కో షేరుపై ఒక ఉచిత షేరును అందించాలని నిర్ణయించారు. బోనస్ షేర్ల ప్రకటనతో ఇంటెగ్రా ఎసెన్షియా షేర్లు ఉదయం ఇంట్రాడేలో 3.57 శాతం పెరిగి రూ.7.25 వద్ద ట్రేడవుతున్నాయి. కంపెనీ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధరను పరిశీలిస్తే రూ.8.80గా ఉండగా.. కనిష్ఠ ధర రూ.5.30గా ఉంది. గడచిన ఐదేళ్ల కాలంలో స్టాక్ సుమారు 340 శాతం అద్భుతమైన రాబడిని అందించింది తన ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చేసింది.
బీమా దిగ్గజం ఎల్ఐసీ 48,59,916 ఇంటిగ్రా ఎసెన్షియా షేర్లను హోల్డ్ చేస్తోంది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో డేటా ప్రకారం ఇది కంపెనీ మెుత్తం షేర్లలో 1.06 శాతం వాటాగా వెల్లడైంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడులు చేయకండి. స్టాక్ మార్కెట్లు నష్టాలతో కూడుకున్నవి. ఏవైనా పెట్టుబడులు పెట్టడానికి ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించటం ఉత్తమం.


Click it and Unblock the Notifications