LIC Assets: దేశీయ దిగ్గజ బీమా సంస్థ LIC ఇప్పటికే పలు రికార్డులను తిరిగి రాసింది. ఎవరూ అందుకోలేని ఫీట్ సొంతం చేసుకుంది. కేవలం ఒక సంస్థే అయినా పాకిస్థాన్ వంటి దేశాలు కూడా అందుకోలేని స్థాయికి ఎదిగింది. ఇటీవలే భారీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్‌గా అందించి మరోసారి వార్తల్లో నిలిచింది. కాగా ఇప్పుడు ఇంకో సంచలనానికి కారణమైంది.
ఆస్తుల నిర్వహణ విషయంలో లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చరిత్ర సృష్టించింది. పలు దేశాల జీడీపీల కంటే అధికంగా 463 బిలియన్ డాలర్ల ఆస్తులను మేనేజ్ చేస్తోంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ గ్రాస్ రిటర్న్ ప్రీమియం పరంగా ప్రపంచంలో 5వ స్థానంలో నిలవగా.. ఇక ఆస్తుల విషయానికి వస్తే 10వ పొజిషన్ సొంతం చేసుకుంది.

మొత్తం భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమతో పోలిస్తే LIC ఆస్తులు 1.1 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. మార్చి 31, 2021 నాటికి వాటి విలువ రూ. 31.4 ట్రిలియన్లు. సోమాలియా, మొజాంబిక్, దక్షిణ సూడాన్, బురుండి మొదలైన దేశాల కంటే LIC ఆస్తులే ఎక్కువని తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ GDP 280 బిలియన్ డాలర్లు, బంగ్లాదేశ్ GDP 350 బిలియన్ డాలర్లు మరియు శ్రీలంక GDP 81 బిలియన్ డాలర్లు కాగా అవి టచ్ చేయలేని స్థాయిలో LIC అలరారుతోంది.
ఇక దేశీయ బీమా రంగంలోని ఇతర ప్లేయర్స్‌తో పోలిస్తే రెండవ అతిపెద్ద ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీ SBI లైఫ్ AUM కంటే LIC ఆస్తులు 16.3 రెట్లు ఎక్కువ. అంతేకాకుండా మొత్తం NSE మార్కెట్ క్యాపిటలైజేషన్ (MCap)లో 4 శాతం LIC వద్దే ఉందంటే ఆ సంస్థ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. స్వతంత్ర ప్రాతిపదికన LIC నిర్వహణలో ఉన్న ఆస్తులు భారత GDPలో 18 శాతానికి సమానం.


Click it and Unblock the Notifications