ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మెచ్యూరిటీ క్లెయిమ్ చేసుకునే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. పాలసీహోల్డర్లు తమ ఎల్ఐసీ మెచ్యూరిటీ క్లెయిమ్ డాక్యుమెంట్స్‌ను దేశంలో ఎక్కడైనా సమర్పించవచ్చునని ఇటీవల ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటన ప్రకారం 'మెచ్యూరిటీ పేమెంట్స్ డ్యూస్‌కు సంబంధించి ఏ బ్రాంచీ పాలసీదారు అయినా తమ మెచ్యూరిటీ క్లెయిమ్స్‌ను 113 డివిజనల్ ఆఫీస్, 2048 బ్రాంచీలు, 1526 శాటిలైట్ ఆఫీస్‌లు, 74 కస్టమర్ జోన్లలో మెచ్యూరిటీ క్లెయిమ్స్ సమర్పించవచ్చును' అని తెలిపింది.
కరోనా కారణంగా క్లెయిమ్స్ విషయంలో పాలసీదారులు ఎదుర్కొంటోన్న ఇబ్బందుల నేపథ్యంలో మెచ్యూరిటీ తీరిన పాలసీలను తమ సమీప ఎల్ఐసీ కార్యాలయంలో క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం పాలసీదారులకు అతిపెద్ద ఊరట. అయితే ఈ అవకాశం ఈ మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది. పాలసీ క్లెయిమ్స్ కోసం పాలసీదారులు తమ సమీప ఎల్ఐసీ ఆఫీస్‌లో సంబంధిత పత్రాలను సమర్పించాలి.

పాలసీదారుడు తన సర్వీసింగ్ బ్రాంచీతో సంబంధం లేకుండా ఏ సమీప బ్రాంచీ నుండి అయినా మెచ్యూరిటీ క్లాయిమ్స్ చేసుకోవచ్చు. అయితే ఎక్కడ దరఖాస్తు చేసుకున్నా క్లెయిమ్స్ చెల్లింపును మాత్రం సంబంధిత సర్వీసింగ్ బ్రాంచీ మాత్రమే ప్రాసెస్ చేస్తుంది. మొదట పాలసీదారు అందించిన డాక్యుమెంట్లను ఆన్‌లైన్ ద్వారా సంబంధిత సర్వీసింగ్ బ్రాంచీకి బదిలీ చేస్తుంది. ఈ క్లెయిమ్స్‌కు సంబంధించిన ప్రక్రియను సులభతరం చేసేందుకు సంబంధిత అధికారులకు ప్రత్యేక అధికారం ఉంటుంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications