LIC సరికొత్త రికార్డ్, కరోనా సమయంలోను అత్యధిక కొత్త ప్రీమియం వసూళ్లు
లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) సరికొత్త రికార్డును సృష్టించింది. కరోనా కాలంలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.1.84 లక్షల కోట్లను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలం రూ.1.77 లక్షలతో పోలిస్తే ఇది 3.4 శాతం అధికం. కరోనా మహమ్మారి వంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశీయ అతిపెద్ద ఇన్సురెన్స్ కంపెనీ ఈ ఘనతను సాధించింది. అదే సమయంలో ఎల్ఐసీ రూ.1.34 లక్షల కోట్ల మొత్తాన్ని గత ఆర్థిక సంవత్సరంలో క్లెయిమ్స్‌గా చెల్లించింది.

ఎల్ఐసీ మార్కెట్ వాటా
రూ.1.85 లక్షల కోట్లలో ఎల్ఐసీ కొత్త ప్రీమియం వసూళ్లు రూ.56,406 కోట్లుగా ఉంది. తొలి ప్రీమియం వృద్ధి పది శాతం నమోదయింది. పెన్షన్, గ్రూప్ ఇన్సురెన్స్ స్కీం ద్వారా గత ఏడాది రూ.1.27 లక్షలకోట్లు వచ్చాయి. కొత్త ప్రీమియానికి సంబంధించి ఎల్ఐసీ మార్కెట్ షేర్ గత మార్చి నెలలో 64.74 శాతంగా ఉండగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి 66.18 శాతంగా ఉంది. మార్కెట్ షేర్ మార్చి నెలలో 81.04 శాతం కాగా, పూర్తి సంవత్సరానికి 75 శాతంగా ఉంది.

ప్రీమియం వసూళ్లు
లైఫ్ ఇన్సురెన్స్ సెక్టార్ మొత్తం కొత్త ప్రీమియం వసూళ్లు రూ.2.78 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రయివేటు లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సరం రూ.94,103 కోట్లు కలెక్ట్ చేశాయి. ఏడాది ప్రాతిపదికన వృద్ధి 16.3 శాతంగా ఉంది. దేశీయ అతిపెద్ద ఇన్సురెన్స్ కంపెనీ ఎల్ఐసీకి గత ఏడాది 3,45,469 ఏజెంట్లు యాడ్ అయ్యారు. దీంతో మొత్తం ఏజెంట్లు 13.53కు పెరిగింది.

క్లెయిమ్స్
2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇన్సురెన్స్ కంపెనీ 9.59 లక్షల మరణాలకు సంబంధించిన క్లెయిమ్స్ సెటిల్ చేసింది. వీటి మొత్తం వ్యాల్యూ రూ.181 బిలియన్లు. కరోనా కారణంగా గత ఏడాది క్లెయిమ్స్ పెద్ద మొత్తంలో పెరిగిన విషయం తెలిసిందే. అదే సమయంలో హెల్త్ ఇన్సురెన్స్ తీసుకునే వారు కూడా పెరుగుతున్నారు.


Click it and Unblock the Notifications