ఎల్‌ఐసీలోని రూ.880 కోట్లు ఎవరివి.. పాలసీదారులు ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే ?
ఇండియాలోని అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) 2023-24 సంవత్సరంలో క్లెయిమ్ చేయని(unclaimed-maturity) మెచ్యూరిటీ మొత్తం రూ. 880.93 కోట్లు ఉందని తెలిపింది. 2024లో 3,72,282 పాలసీదారులు మెచ్యూరిటీ పూర్తయినా కూడా డబ్బు తీసుకోలేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో తెలిపారు. అయితే క్లెయిమ్ చేయని మొత్తం గురించి తెలుసుకోవడానికి ఎం చేయాలి అనే ప్రశ్న తలెత్తుతుంది ?
ఏ డాకుమెంట్స్ అవసరం?
LIC పాలసీ నంబర్, పాలసీదారుడి పేరు, పుట్టిన తేదీ ఇంకా పాన్ కార్డ్
LIC వెబ్‌సైట్‌లో తెలుసుకోవడం ఎలా?
ఏదైనా ఎల్‌ఐసి పాలసీదారుడు లేదా లబ్ధిదారుడు తన ఎల్‌ఐసి పాలసీ కింద క్లెయిమ్ చేయని మొత్తం ఉందొ లేదో తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న సమాచారాన్ని ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు:
స్టెప్ 1: ఎల్‌ఐసి అఫీషియల్ వెబ్‌సైట్ - https://licindia.in/homeStepకి వెళ్లండి
స్టెప్ 2: కస్టమర్ సర్వీస్‌పై క్లిక్ చేసి 'Unclaimed Amount of Policy Holders' సెలెక్ట్ చేసుకోండి.
స్టెప్ 3: పాలసీ నంబర్, పేరు (తప్పనిసరిగా), పుట్టిన తేదీ (తప్పనిసరి), పాన్ కార్డ్ సమాచారాన్ని ఎంటర్ చేయండి.
స్టెప్ 4: ఇప్పుడు కావాల్సిన సమాచారాన్ని పొందడానికి 'సమ్మిట్'పై క్లిక్ చేయండి.

ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
క్లెయిమ్ చేయని ఇంకా పెండింగ్ క్లెయిమ్‌లను తగ్గించడానికి LIC పలు చర్యలు తీసుకుంది. వీటిలో ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాలో యాడ్స్, అలాగే పాలసీ హోల్డర్‌లు పెండింగ్ ఉన్నవి క్లెయిమ్ చేసుకునేలా ప్రోత్సహించడానికి రేడియో జింగిల్స్ కూడా ఉన్నాయి. క్లెయిమ్ సొల్యూషన్ ప్రాసెస్ ఈజీ చేసినట్లు మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. క్లెయిమ్ పూర్తి చేయడానికి వాలిడిటీ ఉన్న NEFT మాత్రమే అవసరం.
క్లెయిమ్ చేయని డబ్బు ఏమవుతుంది ?
10 సంవత్సరాలకు మించి ఉన్న మొత్తానికి క్లెయిమ్ హోల్డర్లు రాకపోతే ఆ మొత్తం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్‌కు వెళుతుంది. నిబంధనల ప్రకారం ఈ డబ్బు వృద్ధుల సంక్షేమానికి వినియోగిస్తారు.
కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
15 ఫిబ్రవరి 2024 నాటి IRDAI సర్క్యులర్ ప్రకారం, 'ఇన్సూరెన్స్ కంపెనీలతో జరిపిన చర్చల ఆధారంగా క్లెయిమ్ చేయని డబ్బు పెరగడానికి కారణం ఏమిటంటే కస్టమర్‌లను ట్రేస్ చేయకపోవడం వల్ల ఛాల కేసులు ఉన్నాయి. కానీ చాలా కారణాల వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు క్లెయిమ్‌లు చెల్లించలేకపోతున్నాయి.
కారణం ఏమిటి?
ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ కింద లిటిగేషన్ - కాంఫ్లిక్ట్ క్లెయిమ్‌ల కారణంగా ఏదైనా ప్రభుత్వ ఏజెన్సీ ఇన్సూరెన్స్ పాలసీలను ఫ్రిజింగ్/బ్లాక్ చేయడం వల్ల కస్టమర్లు పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై క్లెయిమ్ చేయలేదు.
IRDAI సర్క్యులర్‌లో ఏముంది?
IRDAI సర్క్యులర్ ప్రకారం, ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌లో ఏదైనా క్లెయిమ్ చేయని రూ. 1000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం గురించి సమాచారాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలి. 10 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా ఈ సమాచారాన్ని చూపించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications