Multibagger Stock: కొన్ని స్టాక్స్ తన ఇన్వెస్టర్లకు స్వల్ప కాలంలోనే రెట్టింపు రాబడులను అందిస్తున్నాయి. ఇందుకోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన పనిలేదని ఈ స్టాక్ నిరూపించింది. కేవలం మూడు వారాల్లోనే ఇన్వెస్టర్ల డబ్బును డబుల్ చేసింది.

కంపెనీ వివరాలు..
గత నెల రోజులుగా స్టాక్ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఇలాంటి ఓలటైల్ సందర్భాల్లోనూ ఫుట్‌వేర్ కంపెనీ లిబర్టీ షూస్ తన ఇన్వెస్టర్ల సంపదను రెండితలు చేసి మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. సెప్టెంబర్ నెలలో లిబర్టీ షూస్ షేర్ రికార్డు స్థాయిని తాకింది. అప్పటి నుంచి ఈ స్టాక్ క్రమంగా పెరుగుతూ వచ్చింది.

ఊహించని రాబడులు..
పాదరక్షల తయారీ కంపెనీ లిబర్టీ షూస్ లిమిటెల్ కేవలం ఒక్క నెలలో 104 శాతం లాభపడింది. ఇదే సమయంలో S&P BSE సెన్సెక్స్ 1.7 శాతం పతనమైంది. గడచిన ఐదు రోజుల్లో స్టాక్ ఏకంగా 30% వరకు పెరిగింది. ఏడాది ప్రాతిపదికన స్టాక్ 118.99% పెరిగింది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.124.05 ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర 346.80గా ఉంది. ఈ రోజు మార్కెట్లు ముగిసే సమయానికి స్టాక్ ధర రూ.335.40 వద్ద ఉంది.

కంపెనీ వ్యాపారం..
లిబర్టీ షూస్ ప్రస్తుతం రోజుకు 50,000 బూట్లను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పది విభిన్న బ్రాండ్లను తయారు చేస్తోంది. లీప్ 7X, హీలర్, లూసీ & లూక్, AHA కంపెనీ యాజమాన్యంలోని బ్రాండ్‌లు. ఇవి మార్కెట్లో కస్టమర్ల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. 2022-23 సంవత్సరంలో 30 శాతం వృద్ధిని సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications