బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రికార్డును కూడా దాటేసిన LG IPO... రూ. 4.39 లక్షల కోట్ల బిడ్స్‌తో పెట్టుబడిదారుల హడావిడి
LG ఎలక్ట్రానిక్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన IPO కి పెట్టుబడిదారుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. మొత్తం రూ. 11,607 కోట్ల పరిమాణంలో ఉన్న ఈ పబ్లిక్ ఇష్యూ, మూడు రోజుల వ్యవధిలోనే రూ. 4.39 లక్షల కోట్ల బిడ్స్‌ను అందుకుంది. దీంతో ఇది 2025లో ఇప్పటివరకు మూడవ అతిపెద్ద IPOగా నిలిచింది.
ఈ IPOలో పెద్ద పెట్టుబడి సంస్థలే (QIBs) ముందుండి దూసుకెళ్లాయి. వీటిలో ప్రధానంగా బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇతర పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు ఉంటాయి. వీరికి కేటాయించిన షేర్ల కంటే 166.5 రెట్లు ఎక్కువ బిడ్స్ రావడం మార్కెట్‌లో ఈ ఇష్యూకి ఉన్న క్రేజ్‌ని స్పష్టంగా చూపించింది. వాళ్ళ తర్వత HNIలు (హై నెట్వర్క్ ఇండివిడుయల్స్) కూడా భారీగా ముందుకొచ్చారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి చేసే ఈ విభాగం పెట్టుబడిదారులు వారికి కేటాయించిన 1.5 కోట్ల షేర్ల స్థానంలో మొత్తం 34 కోట్ల షేర్లకు బిడ్స్ పెట్టారు అంటే దాదాపు 22.4 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ చేశారు. ఇది HNIలలో కూడా ఈ IPO పై గట్టి నమ్మకం ఉందని సూచిస్తోంది.

ఇక ఉద్యోగుల కోసం కేటాయించిన భాగం కూడా చక్కగా స్పందన పొంది 7.6 రెట్లు బుక్ అయింది. చివరగా, రిటైల్ ఇన్వెస్టర్లు కూడా వెనుకపడకుండా మంచి సంఖ్యలో అప్లికేషన్లు సమర్పించారు. వారికి కేటాయించిన కోటా 3.5 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం ద్వారా అన్ని వర్గాల పెట్టుబడిదారుల నుంచి ఈ IPOకి విశేషమైన ఆదరణ లభించినట్లు స్పష్టమవుతోంది.
గత సంవత్సరం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPOకి రూ. 3.2 లక్షల కోట్ల బిడ్స్ వచ్చి రికార్డ్ సృష్టించింది. కానీ LG IPO ఆ రికార్డుని కూడా దాటేసి రూ. 4.39 లక్షల కోట్ల బిడ్స్‌తో కొత్త మైలురాయి అందుకుంది. IPO ధరను రూ. 1080 - రూ. 1140 మధ్య నిర్ణయించారు. ఒక్క లాట్‌లో 13 షేర్లు ఉండగా, మొత్తం పెట్టుబడి రూ. 14,820 అవుతుంది. ప్రస్తుతం గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) రూ. 345 - రూ. 350 మధ్య ట్రేడవుతోంది. అంటే లిస్టింగ్ సమయంలో షేర్ ధర సుమారు రూ. 1490 వరకూ వెళ్లే అవకాశముందనే అంచనాలు. అయితే ఇది అధికారిక సూచిక కాదని గమనించాలి.
బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ మీకోసం.. అధిక వడ్డీ రేటుతో..
HDB ఫైనాన్షియల్, టాటా క్యాపిటల్ తర్వాత LG IPO 2025లో మూడవ పెద్ద ఇష్యూగా రికార్డు బుక్‌లోకి చేరింది. రూ.10,000 కోట్లకుపైగా పరిమాణం ఉన్న పెద్ద IPOల లిస్టులో కూడా ఇది ఒక ముఖ్యమైన పేరు. LG ఇండియా హోమ్ అప్లయెన్సెస్ & కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎప్పటి నుంచో ముందంజలో ఉంది. దానికి కారణం బలమైన బ్రాండ్ పేరు, కొత్త టెక్నాలజీలు, విస్తృత డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్, దీర్ఘకాల సరఫరాదారుల నమ్మకం. ఈ బలం వల్లే IPOకి ఇంత భారీ స్పందన వచ్చింది.
FY26 అంచనా లాభాల ఆధారంగా చూస్తే, కంపెనీ P/E రేషియో 37.6 రెట్లు ఉంది. IPO తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 77,380 కోట్లు అవుతుంది. పరిశ్రమలో LGకి ఉన్న స్థానం, మార్కెట్ షేర్, ఇన్‌హౌస్ తయారీ సామర్థ్యాల వల్ల ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన అవకాశం అని బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రాథి 'సబ్‌స్క్రైబ్' రేటింగ్ ఇచ్చింది. మొత్తం మీద LG IPO పెట్టుబడిదారులను బాగా ఆకట్టుకుంది. మార్కెట్‌లో ఇది ఎంత బలంగా లిస్టవుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications