LIC Vs Mutual Funds: ఎల్ఐసీ, మ్యూచువల్ ఫండ్స్.. ఎందులో పెట్టుబడి మంచిది..!
ప్రతి ఒక్కరు సంపాదించిన డబ్బులో ఎంతో కొంత పొదుపు చేయాలి. ఎందుకంటే భవిష్యత్ అవసరాలు తీరాలంటే ఇప్పుడు పొదుపు చేయడమే సరైనా మార్గంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పొదుపు చేయాలంటే చాలా మంది చీటీలు కడుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఎందకంటే వీటికి ఎలాంటి రక్షణ లేదు. చీటీలు నమ్మకంపైనే నడుస్తుంటాయి. చీటీలు వేయడం వల్ల ఎక్కువ రాబడిని పొందలేరు.
అలాగే కొందరు సంప్రదాయక పద్ధతిలో పోస్టాఫీస్ లేదా ఎల్ఐసీ పాలసీలు తీసుకుంటారు. ఇవి రక్షణతో కూడన్న కచ్చితమైన రాబటిని ఇస్తాయి. అయితే ఇందులో మామాలు రాబడి మాత్రమే వస్తుంది. అందుకే చాలా ఆర్థిక నిపుణులు మ్యూచువల్ ఫండ్లలో పెట్టిబడి పెట్టాలని సూచిస్తారు. మొత్తం సొమ్ము కాకుండా కొంత మొత్తాన్ని ఈక్విటీలో పెట్టడం మంచిదని సూచిస్తున్నారు.

LIC అనేది జీవితం మరియు ఆరోగ్యం వంటి బీమాను అందించే ప్రభుత్వ-మద్దతు గల సంస్థ. LIC యొక్క జీవిత బీమా పథకం జీవిత ప్రమాద రక్షణ మరియు ఆర్థిక భద్రతను అందిస్తుంది. పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే, నామినీకి మరణ ప్రయోజనం లభిస్తుంది. అంటే ఇందులో బీమా ఉంటుంది. కానీ రాబడి తక్కువగా ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్లలో బీమా ఉండదు.. కానీ దీర్ఘకాలంలో రాబడి ఎక్కువగా ఉంటుంది.
సో మీరు బీమా కోసం టర్మ్ తీసుకుంటే మంచిది. అలాగే పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్లు, పీపీఎఫ్, బంగారంపై పెట్టుబడులు పెట్టొచ్చు. బీమా పాలసీలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C కింద, జీవిత బీమాపై రూ. 1.5 లక్షల వరకు ప్రీమియం చెల్లింపులకు పన్ను ఉండదు. అదే మ్యూచువల్ ఫండ్లకు పన్న కట్టాల్సి ఉంటుంది.
ఒకరి కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేయడమే పెట్టుబడి లక్ష్యం అయితే, ఒకరి కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేయడమే పెట్టుబడి లక్ష్యం అయితే, జీవిత బీమా మరింత ప్రయోజనకరమైన ఎంపిక. ఏదైనా పెట్టుబడిదారుడు తమ మొత్తాన్ని ఇతర ఎల్‌ఐసి పాలసీలలో పెట్టుబడి పెట్టవచ్చు. భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడంతో పాటు బీమా కూడా అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications