Best Flexi Cap Mutual Funds: గత ఐదేళ్లలో అత్యధిక రాబడి అందిస్తున్న ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఇవే..
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో చాలా రకాల ఫండ్లు ఉంటాయి. అందులో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ రకం ఒకటి. ఇవి ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఇవి లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్ లేదా స్మాల్-క్యాప్ వంటి వివిధ మార్కెట్ క్యాప్ విభాగాలకు చెందిన కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. వివిధ రంగాలు, మార్కెట్ క్యాప్ విభాగాలకు చెందిన కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టే వెసులుబాటును ఇవి ఫండ్ మేనేజర్లకు ఉంటాయి. దీనివల్ల పెట్టుబడిదారులు వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండి, తద్వారా రిస్క్, రాబడి (రిటర్న్) అంశాల మధ్య సమతుల్యతను సాధించగలుగుతారు. 5 ఏళ్ల వార్షిక రాబడి ఆధారంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ పరిశీలిద్దాం..

పరాగ్ పారిఖ్ ఫ్లేక్సీ క్యాప్ ఫండ్
పరాగ్ పారిఖ్ ఫ్లేక్సీ క్యాప్ ఫండ్ మే 2013లో ప్రారంభమైంది. గత ఐదేళ్లలో రోలింగ్ రిటర్న్స్ ఆధారంగా 21% రాబడిని అందించింది. 'పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్' గతంలో మొదటి క్వార్టైల్‌లో ఉన్నప్పటికీ, గత ఏడు నెలలుగా రెండవ క్వార్టైల్‌లో కొనసాగుతోంది.
HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్
జనవరి 1995లో ప్రారంభమైన ఈ ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్, గత ఐదేళ్లలో రోలింగ్ రిటర్న్స్ ఆధారంగా సుమారు 18.5% రాబడిని అందించింది. 'HDFC ఫ్లెక్సీ క్యాప్ ఫండ్' గత 17 నెలలుగా మొదటి క్వార్టైల్‌లోనే కొనసాగుతోంది.
UTI ఫ్లెక్సీ క్యాప్ ఫండ్
UTI ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఆగస్టు 2005లో ప్రారంభమైంది. ఈ ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్ గత ఐదేళ్లలో రోలింగ్ రిటర్న్స్ ఆధారంగా సుమారు 14% రాబడిని అందించింది. 'UTI ఫ్లెక్సీ క్యాప్ ఫండ్' గత 39 నెలలుగా నాలుగో క్వార్టైల్‌లోనే కొనసాగుతోంది.
పీజీఐఎం ఇండియా ఫ్లెక్సీ క్యాప్
పీజీఐఎం ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మార్చి 2015లో ప్రారంభమైంది. ఈ ఫండ్ గత ఐదేళ్లలో రోలింగ్ రిటర్న్స్ ఆధారంగా సుమారు 17.7% రాబడిని అందించింది. ఈ ఫండ్ గతంలో నాలుగవ క్వార్టైల్‌లో ఉన్నప్పటికీ, గత నెలలో మూడవ క్వార్టైల్‌కు మారింది.
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఆగస్టు 1998లో ప్రారంభమైంది. గత ఐదేళ్లలో రోలింగ్ రిటర్న్స్ ఆధారంగా దాదాపు 15.5 శాతం రాబడిని అందించింది. ఈ ఫండ్ గతంలో మొదటి క్వార్టైల్‌లో ఉన్నప్పటికీ, గత నెలలో రెండో క్వార్టైల్‌కు మారింది.
ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్
ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ సెప్టెంబర్ 2005లో ప్రారంభమైంది. గత ఐదేళ్లలో రోలింగ్ రిటర్న్స్ ఆధారంగా సుమారు 13.9% రాబడిని అందించింది.
కెనరా రోబకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్
కెనరా రోబకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ సెప్టెంబర్ 2003లో ప్రారంభమైంది. గత ఐదేళ్లలో రోలింగ్ రిటర్న్స్ ఆధారంగా సుమారు 16% రాబడిని అందించింది. ఈ ఫండ్ గత 36 నెలలుగా మూడవ క్వార్టైల్‌లోనే కొనసాగుతోంది.
ఇక్కడ పెట్టుబడిదారులు తమ పెట్టుబడి కాలపరిమితి ఐదు నుంచి ఏడు సంవత్సరాలు ఉన్నట్లయితే మాత్రమే ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్స్‌ను పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో సంపదను సృష్టించాలని భావించే, మితమైన రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారులకు ఈ పథకాలు సాధారణంగా అనుకూలంగా ఉంటాయని పేర్కొంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications