NPS Vs PPF: ఎన్పీఎస్, పీపీఎఫ్ పథకాల్లో ఏది బెటర్.. ఎందులో రాబడి ఎక్కువ ఉంటుంది..!
ప్రభుత్వ మద్దతు గల పథకాలు చాలా ఉన్నాయి. అయితే ఏ పథకంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలో వస్తాయో చాలా మందికి తెలియదు. ప్రభుత్వ మద్దతు గల పీపీఎఫ్, ఎన్పీఎస్ గురించి పరిశీలిద్దాం. ఈ రెండు పథకాల్లో ఒకటి రిటైర్మెంట్ దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెట్టే పథకం అయితే మరొకటి నిర్ణీత సమయం పెట్టుబడి పెట్టే పథకం. అయితే ఈ పథకాన్ని రిటైర్మెంట్ వరకు పొడిగించుకోవచ్చు. అయితే ఈ రెండు పథకాల్లో ఏది బెటర్ అని చాలా మందికి డౌట్ వస్తుంది.
ముందుగా పీపీఎఫ్ గురించి మాట్లాడుకుంటే.. ఇందులో పెట్టుబడి సురక్షితం, ఖచ్చితమైన రాబడి కూడా ఉంటుంది. ఇందులో మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే మెచ్యూరిటీ తర్వాత 5 సంవత్సరాల చొప్పున దీన్ని పొడగించుకోవచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ 7.1 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీస్ లేదా బ్యాంకుల్లో ఓపెన్ చేయవచ్చు. మీరు ఈ పథకంలో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో వచ్చే డబ్బుకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. రూ.1,50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.

మీరు నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ.1,50, 000 పెట్టుబడి పెడతారు. అంటే 15 సంవత్సరాల పాటు ఇంతే మొత్తంలో పెట్టుబడి పెడితే మంచి రాబడి ఉంటుంది. 15 ఏళ్ల మీరు రూ.22,50,000 చెల్లిస్తారు. మీకు రూ.18,18,209 వడ్డీ వస్తుంది. మొత్తం రూ.40,68,209 మీరు పొందవచ్చు. దీన్ని 5 సంవత్సరాల చొప్పున మరో 10 ఏళ్ల పొడిగిస్తే భారీగా సొమ్ము మీ సొంతం అవుతుంది. అంతేకాదు. మీరు పీపీఎఫ్ లో పెట్టుబడి పెడుతున్న సందర్భాల్లో ఎప్పుడైనా డబ్బు అవసరం ఉంటే.. లోన్ కూడా తీసుకోవచ్చు, వడ్డీ రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది.
అయితే మంచి రాబడి రావాలంటే పీపీఎఫ్ కంటే ఎన్పీఎస్ బెటరని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో రిస్క్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎన్పీఎస్ ఖాతాను బ్యాంకులో లేదా eNPS Portal, CAMS NPS ఓపెన్ చేయవచ్చు. NPSలో పెట్టుబడిదారుడు ఫండ్ మేనేజర్ ఎంచుకుని పెట్టుబడి పెట్టాలి. ఇందులో మొత్తం ఎనిమిది మంది ఫండ్ మేనేజర్లు ఉన్నారు. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంలో 60 శాతం ఈక్విటీలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇక ఇందులో రిటైర్మెంట్ తర్వాత మెచ్యూరిటీ డబ్బులు వస్తాయి. అందులో 60 శాతం వరకే విత్ డ్రా చేసుకోవాలి. మిగిలిన 40 శాతంతో పింఛన్ కోసం ఉంచుకోవాలి. ఇందులో మార్కెట్ ను బట్టి రాబడి ఉంటుంది. ఖచ్చితమైన రాబడి మాత్రం ఉండదు.
అయితే మీ వయసును బట్టి ఎందులో పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవాలి. మీకు వయసు తక్కువగా ఉంటే ఎన్పీఎస్ పథం ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు. వయసు ఎక్కువగా ఉంటే పీపీఎఫ్ పథం ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications