ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో చిరుత.. దెబ్బకు ఉద్యోగులకు వర్క్ ఫ్రొమ్ హోమ్..
కొద్దిరోజుల క్రితం బెంగళూరు, మైసూరులో చిరుతపులిని కనిపించిన సంఘటనల తరువాత ఇవాళ డిసెంబర్ 31న ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లో ఓ చిరుతపులి ప్రత్యక్షమైంది. దింతో వెంటనే ఉద్యోగుల భద్రత దృశ్య తక్షణమే చర్య తీసుకోవాలని టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ నిర్ణయించింది. డిసెంబరు 31న క్యాంపస్ తాత్కాలికంగా మూసివేసి వర్క్ ఫ్రొం హోమ్ చేయాలని కంపెనీ సిబ్బందిని ఆదేశించింది.
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఒక నోట్ లో భద్రతా చర్యలు అమలులో ఉన్నాయని వివరించింది. అలాగే ఉద్యోగులు ఇంట్లోనే ఉండాలని సూచించింది. "ఈరోజు మైసూరు డిసి క్యాంపస్‌లో ఒక అడవి జంతువు కనిపించింది. టాస్క్‌ఫోర్స్ సహకారంతో క్యాంపస్ భద్రత ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని కంపెనీ పేర్కొంది. ఈ రోజు (డిసెంబర్ 31) వర్క్ ఫ్రొం హోమ్ చేయలని కోరింది. క్యాంపస్‌లోకి ఎవరినీ అనుమతించవద్దని కూడా సెక్యూరిటీ టీంకి సూచించింది

అడవి జంతువు కనిపించడంతో స్థానిక అటవీ శాఖ తక్షణమే స్పందించి, చిరుతపులిని గుర్తించి పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. నివేదికల ప్రకారం, మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు చిరుతపులి మొదటిసారిగా సిసిటివిలో కనిపించింది తరువాత మళ్ళీ ఉదయం 4 గంటలకు కనిపించింది. అటవీ శాఖ అధికారులు కూంబింగ్ ఆపరేషన్ ద్వారా చిరుతపులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) IB ప్రభు గౌడ వెల్లడించారు.
మంగళవారం ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్‌లోకి చిరుత ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు స్పష్టం చేసారు అలాగే చిరుతపులిని రక్షించే పనిని టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించామని చెప్పారు.
ఇలాంటి ఘటన ఇది మొదటిసారి కాదు. 2011లో రిజర్వ్ ఫారెస్ట్‌కు సమీపంలోని హెబ్బాల్ ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో ఉన్న క్యాంపస్‌లో కూడా ఒక చిరుతపులి సంచరించింది. ఆహారం కోసం చిరుతపులి అటవీ నుంచి దూరమై ఉండొచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. అలాగే ఇన్ఫోసిస్ ట్రైనీలందరినీ కూడా ఇంట్లోనే ఉండాలని సూచించింది. "ట్రైనింగ్ షెడ్యూల్ ఒక రోజు పోస్ట్ ఫోన్ అవుతుంది. మీరు మీ హాస్టల్ గదుల్లో ఉండండి, సెల్ఫ్-స్టడీ కోసం ఈ రోజును ఉపయోగించుకోండి" అని ట్రైనీలకు ఇంటర్నల్ మెమో ద్వారా తేలిపింది.
చిరుతపులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా, చిరుతపులిని సురక్షితంగా క్యాంపస్ ప్రాంతం నుండి అడావిలోకి పంపిస్తాని, అలాగే క్యాంపస్ కార్యకలాపాలు సాధారణ స్థాయికి తిరిగి రావడానికి అటవీ శాఖ కృషి చేస్తోందన్నారు.


Click it and Unblock the Notifications