Lenskart News: దేశంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన స్టార్టప్ కల్చర్ కారణంగా కంపెనీల వ్యవస్థాపకులు ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ప్రముఖ నగరాల్లో ప్రాపర్టీలను కొనుగోలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు.
దేశంలో కళ్లజోళ్ల వ్యాపారంలో మంచి గుర్తింపు పొందిన బ్రాండ్‌గా లెన్స్ కార్ట్ నిలిచింది. పెద్దగా స్థంస్థాగత కంపెనీలు లేకపోవటంతో ప్రజల నుంచి మంచి ఆదరణను పొందింది. దీనిని స్థాపించిన వారిలో పీయూష్ బన్సాల్ కూడా ఒకరు. షార్క్ ట్యాంక్ ఇండియా న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా రూ.18 కోట్లు వెచ్చించి దిల్లీ నీతి బాగ్‌లో ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ CRE మ్యాట్రిక్స్ వెల్లడించింది.

మే 19, 2023న ఈ లగ్జరీ ప్రాపర్టీ డీల్ జరిగినట్లు డేటా వెల్లడించింది. 5056 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాపర్టీ ఉంది. దీని కొనుగోలు కోసం బన్సాల్ రూ.1.08 కోట్లను స్టాంప్ డ్యూటీగా చెల్లించారు. పత్రాల ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ మరియు బేస్‌మెంట్‌ను కవర్ చేసే బంగ్లాను సురీందర్ సింగ్ అత్వాల్ నుంచి బన్సల్ కొనుగోలు చేశారు. గౌతం అదానీ నుంచి పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ వరకు అనేక మంది వ్యాపారవేత్తలు సొంత ఇల్లు కొనుక్కుని దిల్లీలో స్థిరపడ్డారు.
దీనికి ముందు మార్చిలో కొన్ని ఖరీదైన ఆస్తి లావాదేవీలు జరిగాయి. వీటిలో ముందుగా ప్రతిష్టాత్మక గోల్ఫ్ లింక్స్ ప్రాంతంలో 2,160 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న బంగ్లాను భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ భార్య వసుధా రోహత్గీ పేరిట రూ.160 కోట్లకు కొనుగోలు చేయటం జరిగింది. అలాగే ఆగస్టులో గ్లోబల్ డెంట్ ఎయిడ్స్ డైరెక్టర్ రేణు ఖుల్లార్ దిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ ఏరియాలో 873 చదరపు గజాల బంగ్లాను రూ.61.70 కోట్లకు కొనుగోలు చేశారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు, సంపన్నులకు నివాసంగా ఉన్న దిల్లీ ప్రస్తుతం వ్యాపారుల దృష్టిని ఆకర్షిస్తోంది.


Click it and Unblock the Notifications