బెంగళూరు: మనం కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలని, సుదీర్ఘ లాక్ డౌన్ ఉంటే ఈ మహమ్మారితో చనిపోయిన వారి కంటే భోజనం లేక చనిపోయేవారి సంఖ్య పెరుగుతుందని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హెచ్చరించారు. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఎంఎస్ఎంఈలకు, స్టార్టప్స్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాధితులను రక్షిస్తూనే, సామర్థ్యం కలిగిన వారిని తిరిగి వర్క్ చేసేందుకు సిద్ధమవ్వాలన్నారు.

లాక్ డౌన్ వల్ల ఆకలు చావులు పెరుగుతాయి
ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ సరైన నిర్ణయమేనని, కానీ ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం కరోనా వల్ల మృతి చెందిన వారి కంటే ఆకలితో చనిపోయే వారి సంఖ్య పెరుగుతుందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగడం సరికాదన్నారు. లాక్ డౌన్ పొడిగిస్తూ పోతే ఏదో ఒకరోజు వైరస్ కంటే ఆకలి మరణాలు పెరుగుతాయన్నారు. ఆయన హబుధవారం బిజినెస్ లీడర్స్‌తో మాట్లాడారు.

ఇండియా పరిస్థితి బెట్టర్..
అభివృద్ధి దేశాలతో పోలిస్తే భారత దేశం పరిస్థితి బాగుందని నారాయణమూర్తి అన్నారు. మన వద్ద మరణాల రేటు 0.25 శాతం నుండి 0.5 శాతం మాత్రమే ఉందన్నారు. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే కరోనా వ్యాప్తిని చాలా వరకు నిరోధించామని చెప్పారు. వివిధ కారణాల వల్ల ఇండియాలో ప్రతి సంవత్సరం 90 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని, ఇందులో నాలుగింట ఒక వంతు మంది కాలుష్యం వల్ల చనిపోతున్నారన్నారు. ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశాల్లో భారత్ ఒకటి అన్నారు.

జీవనోపాధి కోల్పేయే అవకాశం
ఏడాదిలో 9 మిలియన్ల మందితో పోలిస్తే ఈ రెండు నెలల్లో వెయ్యి మంది చనిపోయారని, ఇది అంత ఆందోళనకర విషయం కాదని మూర్తి అన్నారు. మన దేశంలో 190 మిలియన్ల మంది అసంఘటిత రంగం లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు లాక్ డౌన్ ఇలాగే పొడిగించుకుంటూ వెళ్తే వీరు జీవనోపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎక్కువ కాలం కొనసాగితే ఎక్కువ మంది ఉపాధి కోల్పోతారన్నారు.

కంపెనీలు, ప్రభుత్వ రెవెన్యూలో భారీ కోత
చాలా వ్యాపారాలు తమ ఆదాయంలో 15 శాతం నుండి 20 శాతం మేర కోల్పోయాయని, ఇది ప్రభుత్వ పన్నులు, జీఎస్టీ వసూళ్లపై ప్రభావం చూపుతుందని మూర్తి అన్నారు. అంతర్జాతీయ మానిటరీ ఫండ్ మన వృద్ధి రేటును 4.5 శాతం నుండి 1.9 శాతానికి కుదించిందని గుర్తు చేశారు. కరోనా వైరస్ కొత్త సాధారణ కారకమని మనం అంగీకరించాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు భారత్ కొత్త మార్గాలు వెతకాలన్నారు. బలమైన టెస్ట్ కిట్స్‌ను రూపొందించాలన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications