Promissory Note: ప్రామిసరీ నోటుకు వ్యాలిడిటీ ఉంటుందా.. ఉంటే ఎన్ని రోజులు ఉంటుంది..!

ఒకప్పుడు బ్యాంకులు అందుబాటులో లేనప్పుడు డబ్బు ఉన్నవారి వద్ద అప్పు తీసుకునేవారు. లేదంటే మర్వాడిల వద్ద బంగారం కుదువపెట్టి(తనాఖా పెట్టి) డబ్బులు తీసుకునేవారు. అప్పుగా డబ్బు తీసుకుంటే.. డబ్బు తీసుకున్నట్లు కాగితం రాసేవారు. అందులో అప్పు తీసుకునేవారి వివరాలు, అప్పు ఇచ్చిన వారి వివరాలు, అప్పు ఎంత, వడ్డీ రేట్లు రాసేవారు. తర్వాత అప్పు తీసుకున్నవారి సంతకం, సాక్షి సంతకం తీసుకునే వారు. దీనికి ఎలాంటి చట్టబద్ధత లేదు. ఇది చాల రిస్క్. అయితే ఆ తర్వాత ప్రామిసరీ నోట్లు వచ్చాయి. ప్రామిసరీ నోటులో స్టాంప్ వేస్తారు. ఆ తర్వాత అప్పు ఇస్తున్న వారి వివరాలు, అప్పు తీసుకుంటున్న వారి వివరాలు, అప్పు మొత్తం, వడ్డీ ఎంత అనే రాస్తారు. ఆ తర్వాత అప్పు తీసుకున్నవారి సంతకం, సాక్షి సంతకం తీసుకుంటారు.

ప్రామిసరీ నోటుకు కాస్త చట్ట బద్దత ఉంటుంది. అయితే ఇది కూడా పరిమిత కాలం అని గుర్తుంచుకోవాలి. ప్రామిసరీ నోట్ రాశాం కదా.. ఏం కాదని అనుకోవద్దు. ప్రామిసరీ నోటుకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ లోపు అప్పు చెల్లించకుంటే కోర్టుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కానీ వ్యాలిడిటీ దాటిన తర్వాత కోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రామిసరీ నోటు రాసిన నుంచి మూడేళ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఉదాహరణకు మీరు తేదీ 28-11-2026 ఒక లక్ష అప్పు ఇచ్చారు అనుకుంటే.. ఇందుకు సంబంధించి ప్రామిసరీ నోటు రాస్తే.. దానికి తేదీ 28-11-2029 వరకు వ్యాలిడిటీ ఉంటుంది.

Promissory Note

అప్పు తీసుకున్న వ్యక్తి ముడేళ్ల లోపు తిరిగి చెల్లించకుంటే ఒక నెల ముందుగా అప్పు ఇచ్చిన వారు కోర్టుకు వెళ్లొచ్చు. కోర్టులో సివిల్ రికవరీ సూట్ దాఖలు చేయవచ్చు. ఒక వేళ మూడు సంవత్సరాలు దాటి ఒక రోజు గడిచినా.. కోర్టులో కేసు వేయడం కుదరదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయితే మూడేళ్లు గడిచేలోపు అప్పులో కొంత మొత్తం తిరిగి చెల్లించినట్లు అంగీకరిస్తూ మరో పత్రం రాసి సంతకం రాసి ఇస్తే మరో మూడేళ్లు దానికి వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఈ రుణాలన్ని అన్ సెక్యూర్డ్ రుణాలని గుర్తుంచుకోవాలి. ఇలా అప్పుడు ఇవ్వడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారంగా పరిగణించాలి.

వడ్డీ ఎక్కువగా వస్తుందని ఆశపడి డబ్బులు ఇస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందని గమనించాలి. అయితే ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చిన వ్యక్తి చనిపోతే ఎలా అని డౌట్ రావచ్చు. అలా జరిగితే అతడి ఆస్తులు ఎవరు తీసుకుంటారో వారు అప్పు చెల్లించాల్సి ఉంటుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+