కూతురి కోసం టీచర్ ఉద్యోగాన్ని వదిలేసి.. ఇప్పుడు స్టార్టప్‌తో సక్సెస్ సాధించిన న మహిళా..

మీరు ఏదైనా సాధించాలనుకుంటే మీ నమ్మకం, సంకల్పమే ఆ విజయ శిఖరాలను తీసుకెళ్తాయి. అలాగే పట్టుదల ఉంటే ఏ పనైనా సాధించొచ్చు అని నిరూపించింది ఓ మహిళా. అంతేకాదు ఇప్పడు ఆమె జీవిత కథ, ఎదురుకొన్న సమస్యలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం కూడా. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాకు చెందిన ఒక మహిళా ఉపాధ్యాయురాలు ధైర్యం, కృషితో జీవితంతో సక్సెస్ సాధించింది. ఆమె పేరే రేణు శర్మ. తన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలివేసి ఒక సొంత స్టార్టప్ సియా కిచెన్ అండ్ కేఫ్‌ను ప్రారంభించింది. ఈ ప్రయాణం ఆమెకి అంత ఈజీ కాదు. దీనివల్ల ఆమె ఇంటి బయటి నుండి చాలా సమస్యలు వచ్చాయి. కానీ నేడు ఆమె సక్సెస్ ఫుల్ వ్యవస్థాపకురాలిల తన సొంత మంచి వ్యాపారాన్ని నడుపుతోంది. అంతేకాదు ఆమె ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తోంది.

left job for her daughter and achieved success with a startup Renu sharmas story is full of hurdles

ఒడిదుడుకులతో నిండిన రేణు శర్మ జీవితం: రేణు శర్మ M.Com చదివిన తర్వాత MA ఇంకా B.Ed చేసి ఒక ప్రైవేట్ స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా 2020 సంవత్సరంలో తనకి కుమార్తె జన్మించింది. ఆ సమయంలో దేశం మొత్తం లాక్‌డౌన్ ఉంది. ఆమె, తన భర్త ఇద్దరు కూడా ఉపాధ్యాయులు. 3 నెలలుగా జీతం లేదు ఇంకా స్కూల్ నుండి కూడా ఎలాంటి సహకారం లేకపోవడంతో, తన సేవింగ్స్ డబ్బుతో తన కూతురు సియాను చూసుకుంది.

లాక్‌డౌన్లో జన్మించిన సియా: రేణు శర్మ మొదట రాజస్థాన్ నుండి వచ్చి, ఘజియాబాద్‌లో చదువుకుంటు పెరిగింది. లాక్‌డౌన్ సమయంలో తన కుటుంబం నుండి లేదా ఇతరుల నుండి కూడా ఎటువంటి సహాయం లభించకపోవడంతో తన 3 నెలల కుమార్తెను భర్త ఇంకా అత్తగారికి అప్పగించి కుటుంబాన్ని, సియాను చూసుకోవడానికి HR ఉద్యోగంలో చేరింది. కానీ ఆమె కూతురు లేకుండా ఎక్కువ కాలం జీవించలేకపోయింది, మరోపక్క తన కూతురు కూడా ఆమెను వదిలి ఉండలేకపోయింది. దింతో రెండు నెలల తర్వాత ఆమె ఉద్యోగం మానేసి ఫన్ ఫుడ్ అండ్ సియా పేరుతో స్వంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. ఆ సమయంలో చాలా కష్టపడి పని చేసి ఎన్నో కష్టలను చూసింది. చివరకు ఆమె తన బిడ్డతో కలిసి యూట్యూబ్‌లో వంటకాలను అప్‌లోడ్ చేయడం స్టార్ట్ చేసింది.

ఛానెల్ ఎదుగుతుండటం మరోపక్క టైంకి డబ్బు లేకపోవడం, కుటుంబ మద్దతు కూడా లేకపోవడం వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు రేణు శర్మ చెప్పారు. కానీ ఆమెకి తన పాత పాఠశాల నుండి పిలుపు రావడంతో, ఆమె తన 10 నెలల వయసున్న సియాను తన అత్తగారి చేతుల్లో వదిలివేయాలని నిర్ణయించుకుంది.

స్టార్టప్ గురించి మాట్లాడుతూ, రేణు శర్మ తన ఉద్యోగంలో సంపాదించిన మొత్తాన్ని ఉపయోగించి, ప్రధాన మంత్రి స్వరోజ్‌గార్ యోజన కింద లోన్ తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించానని చెప్పారు. ఇంటి అద్దె చెల్లించడానికి, కూతురిని చూసుకుంటూ మరోపక్క బేకరీని చూసుకుంటూ ఒంటరిగా పనిచేసింది. ఈ సమయంలో కేకులు తయారు చేస్తూ కొన్నిసార్లు రాత్రి 12 గంటల వరకు డెలివరీ చేసింది. ఎక్కడి వెళ్లి నేర్చుకోకుండా సొంతంగా కేకులు తయారు చేయడం నేర్చుకోని వాటిని డెలివరీలు చేసింది. వీటిని కస్టమర్లు కూడా చాలా ఇష్టపడటం ప్రారంభించారు. తన ఇంట్లో ఏ చెఫ్ కూడా ఉపయోగించని ఓవెన్‌ని ఉపయోగించి ఆమె 3 సంవత్సరాలలో దాదాపు 5,000 కేక్‌లను తయారు చేసింది.

అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు. కొంతకాలం తర్వాత కుటుంబం, బంధువులు ఆమె నుండి దూరం కావడం ప్రారంభించారని రేణు చెప్పారు. కానీ కస్టమర్లుగా వచ్చిన వ్యక్తులు గౌరవించడం, మద్దతు ఇవ్వడం ఆమెకి ధైర్యం నింపింది. తన భర్త కూడా మొదట్లో తనకు మద్దతు ఇచ్చేవాడని, కానీ తరువాత అతను కూడా సపోర్ట్ ఇవ్వలేదని చెప్పింది. తన కేఫ్‌లో ముగ్గురుకి ఉపాధి కల్పిస్తున్న రేణు శర్మ తన కలలను నెరవేర్చుకునే రేసులో ఈ ఇబ్బందులు చాలా చిన్నవని చెబుతుంది. సియాస్ కేఫ్‌లో సొంతంగా తయారుచేసే బర్గర్ బన్స్, బర్గర్లు, శాండ్‌విచ్‌లు, క్రీమ్ రోల్స్, పిజ్జాలు, హాట్ డాగ్‌లు, స్టఫ్డ్ కుల్చాస్, బ్రౌనీలు, కేక్లు, పేస్ట్రీలు, మఫిన్లు అందిస్తుంది. రేణు గత సంవత్సరం తాను సొంతంగా ఒక ఇల్లు కొన్నానని అదే తన గుర్తింపు అని, నేను ఈ రోజు ఏమైనా ఉన్నానంటే అది నా కృషి వల్లే అంటూ చెబుతుంది.

ఏదైనా చేయాలనే సంకల్పం, ఇష్టం ఉంటే ఏదైనా సాధ్యమే: భవిష్యత్తులో తన కేఫ్‌ను పెద్దగా చేయాలని రేణు శర్మ కలలు కంటుంది, అలాగే సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని కలలు కనే మహిళలందరికీ ఆమె కథ ఒక ప్రేరణ. ఏదైనా చేయాలనే తపన ఉంటే అసాధ్యం కాదని ఆమె నిరూపించారు. నాలుగు సంవత్సరాల క్రితం, నేను మా అత్తగారి ఇంట్లో వంట చేసేటప్పుడు, నేను బాగా వంట చేసినా మా అత్తగారు నన్ను ప్రశంసించలేదు. కాబట్టి పొగడ్తల కోసం వేచి ఉండవద్దని తన భర్త తనకు చెప్పాడని తెలిపింది. ఇంకా మా కేఫ్ ఫుడ్ కోసం డబ్బు చెల్లించిన తర్వాత ప్రజలు మమ్మల్ని ప్రశంసించడం ప్రారంభించిన రోజు, ఆ ప్రశంసలు విలువైనదని తెలిపింది.

తన తండ్రి గురించి: తన జీవితంలో పొందిన అత్యంత ప్రత్యేకమైన బహుమతిగా ఇంకా ఆదర్శంగా భావించే రేణు వాళ్ళ నాన్న నాలో తనను తాను చూసుకునేవారు కాబట్టి నా తండ్రిని నేను ఆదర్శంగా భావిస్తానని అన్నారు. ఆయనలోని చాలా లక్షణాలు నాలో ఉన్నాయి. సొంతంగా ఏదైనా సాధించాలనే ముక్కుసూటి మనిషి లాంటి వ్యక్తి అని, అలాగే నా గురించి ఆందోళన చెందడం లేదని, ఇంకా తన జీవితాన్ని చక్కగా నిర్వహిస్తుంన్నానని చెప్పేవాడు అని తెలిపింది. జీవితంలోని ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన మాకు నేర్పించారు అని చెప్పింది.

రేణు శర్మ అందరికీ ఇంటి ఫుడ్ గుర్తు చేసే ఆహారాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంటానని అలాగే ఆమె ఏ ఆహారం వండినా, శుభ్రత ఇంకా పరిశుభ్రతపై చాలా శ్రద్ధ చూపుతుందని ఆమె చెబుతుంది. ఆమె ఆహారంలో సుగంధ ద్రవ్యాల నుండి ముడి పదార్థం వరకు ప్రతిదానిపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని, తద్వారా ఆమె ఇంటికి వచ్చే ప్రతి కస్టమర్ బెటర్ వాతావరణాన్ని పొందగలుగుతున్నారని చెప్పుకొచ్చింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+