Petrol, Diesel Price Hike: బ్రేకింగ్ న్యూస్.. పెట్రోల్‎పై రూ.5, డీజిల్‎పై రూ.3 పెంపు..!

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధర భారీగా పెరుగుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కు 100 డాలర్లకు పైనే కొనసాగుతోంది. గత వారం పది రోజులు ముడి చమురు ధరలు భారీగానే ఉన్నాయి. దీంతో వివిధ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నాయి. తాజాగా ఇండియాలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు. ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ లీటర్ పెట్రోల్‌‌‌‌పై రూ.5, డీజిల్‌‌‌‌పై రూ.3 చొప్పున ధర పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడిచమురు, రిఫైన్డ్ ఉత్పత్తుల ధరల భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా 7,108 పెట్రోల్ పంపులు నిర్వహిస్తున్న ఈ సంస్థ శనివారం ఉదయం నుంచే కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలను వినియోగదారులకు బదిలీ చేసిన తొలి ప్రైవేట్ సంస్థగా నయారా నిలిచింది. మిగతా ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థలు కూడా ధరలు పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ చమురు కంపెనీలు మాత్రం ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దేశంలోని 90 శాతం బంకులను నియంత్రించే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీఎల్ వంటి ప్రభుత్వ చమురు సంస్థలు మాత్రం ధరలను మార్చడం లేదు. ప్రస్తుతం ఇవి లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.9 వరకు మార్కెటింగ్ నష్టాలను భరిస్తున్నట్లు ఇక్రా సంస్థ నివేదిక పేర్కొంది. ఎల్పీజీపైనా నష్టాలు వస్తున్నాయని వెల్లడించింది.

Petrol Price

అయితే నష్టాలను ఎక్కువ రోజులు చమురు కంపెనీలు భరించలేవని నిపుణులు చెబుతున్నారు. త్వరలోనే ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ పై ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చమురు సంస్థలు భారీ నష్టాలు భరిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఇలానే ఉంటే ప్రభుత్వ కంపెనీలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేందుకు వెనకడవని చెబుతున్నారు. ఒక వేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే.. రవాణా ఖర్చు పెరుగుతోంది. ఫలితంగా అన్నింటీ ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం కూడా పెరుగుతోంది. దీంతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.

అందుకే అమెరికా, ఇరాన్ మధ్య శాంత చర్చలు జరిగి.. యుద్ధం ముగిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉండని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ముడి చమురు ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ముడి చరుము ధర పెరగడం వల్ల కేవలం భారత్ మాత్రమే కాదు.. ఇంధనంపై ఆధారపడి ఉన్న దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+