Flipkart In Food Delivery: ఫుడ్ డెలివరీ బిజినెస్‎లోకి ఫ్లిప్ కార్ట్.. స్విగ్గీ, జొమాటోకు దబిడ దిబిడే..!

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలోనే ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్ కార్ట్ జొమాటో, స్విగ్గీ సంస్థలకు పోటీ ఇచ్చేందుకు రాబోయే రోజుల్లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. మొదటగా కొన్న నగరాల్లో స్టార్ట్ చేసి క్రమంగా విస్తరించేందుకు కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి, రాబోయే కొద్ది వారాల్లో కంపెనీ తన ఫుడ్ డెలివరీ సేవను ప్రారంభిస్తుందని ధృవీకరించినట్లు ఓ బిజినెస్ వెబ్ సైట్ పేర్కొంది.

ఫ్లిప్‌కార్ట్ మొదట ఈ సేవను పరిమిత సంఖ్యలో వినియోగదారులకు పరిచయం చేస్తుందని, ఆ తర్వాత వినియోగదారుల స్పందనను అర్థం చేసుకుని క్రమంగా విస్తరిస్తుందని ఆయన తెలిపారు. "తమ ఇతర వ్యాపారాల మాదిరిగానే కంపెనీ మొదట ఈ సేవను పరిమిత స్థాయిలో పరిచయం చేస్తుంది, వినియోగదారులతో దాని విలువ ప్రతిపాదనను పరీక్షిస్తుంది, అభిప్రాయాన్ని సేకరిస్తుంది వినియోగదారుల అంచనాలను అందుకునే వరకు సేవను మెరుగుపరుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ఫ్లిప్‌కార్ట్ ఈ సేవను ఎక్కువ మందికి విస్తరించడం ప్రారంభిస్తుంది" అని ఆయన వివరించారు.

Flipkart Food Delivery

వినియోగదారులు ఈ ఫుడ్ డెలివరీ సేవను ఒక ప్రత్యేక యాప్ ద్వారా, అలాగే ప్రధాన ఫ్లిప్‌కార్ట్ యాప్ నుంచీ పొందగలరని కృష్ణమూర్తి తెలిపారు. అయితే ఈ సేవకు ఏ పేరు పెడతారో లేదా ఏ నగరంలో దీనిని మొదట ప్రారంభిస్తారో ఆయన వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్ ప్రభుత్వ ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC)తో అనుసంధానం కావడం ద్వారా ఈ సేవను ప్రారంభించనుంది. ఇప్పటికే ఉన్న ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లతో ఫ్లిప్‌కార్ట్ ఎలా పోటీ పడబోతోందనే దానిపై చర్చించకుండా, వినియోగదారులకు కొత్తదనాన్ని అందించగలమని విశ్వసించినప్పుడే కంపెనీ ఒక వ్యాపారంలోకి ప్రవేశిస్తుందని కృష్ణమూర్తి అన్నారు.

వినియోగదారులు తక్కువ ధరలు మాత్రమే చూడరని.. వినియోగదారులు విస్తృత శ్రేణి రెస్టారెంట్లు, నమ్మకమైన సేవ, వేగవంతమైన డెలివరీలు, సులభమైన మొత్తం అనుభవాన్ని కూడా ఆశిస్తారని ఆయన తెలిపారు. ఈ సర్వీసును దేశవ్యాప్తంగా విస్తరించే ముందు ఫ్లిప్‌కార్ట్ ఈ అన్ని రంగాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుందన్నారు.
ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఫుడ్ డెలివరీ కూడా భాగమైతే, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇప్పటికే అందుబాటులో ఉన్న చాలా రెస్టారెంట్లు అందులో కూడా కనిపిస్తాయని వినియోగదారులు సహజంగానే ఆశిస్తారని ఆయన పేర్కొన్నారు. వ్యాపారాన్ని విస్తరిస్తున్న కొద్దీ, కంపెనీ ఒక సమగ్రమైన రెస్టారెంట్ కేటలాగ్‌ను రూపొందించడానికి కృషి చేస్తుందని ఆయన అన్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+