Flip Kart Food Delivery: స్విగ్గీ, జొమాటోకు షాక్.. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్ కార్ట్..!

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలో ఆధిపత్యం చలాయిస్తున్న జొమాటో, స్విగ్గీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. స్విగ్గీ, జొమాటోకు పోటీగా ఇప్పటికే రాపిడో ఓన్లీతో ఆన్ లైన్ ఫుడ్ డెలవరీలోకి అడుగు పెట్టింది. తాజాగా ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో ఫ్లిప్ కార్ట్ పోటీ పడటానికి సిద్ధంగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ తన ప్రస్తుత షాపింగ్ యాప్‌లోనే ఈ ఫుడ్ డెలివరీ సేవను కూడా ప్రారంభిస్తోందని, ఇందుకోసం తన లాజిస్టిక్స్ విభాగమైన ఏకార్ట్ ద్వారా ప్రత్యేక డెలివరీ టీంను ఉపయోగిస్తోందని టెక్ క్రంచ్ రిపోర్ట్ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ 2026 అక్టోబర్ చివరి నాటికి 'ఈట్-ఇన్ బై మినిట్స్'ను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

బెంగళూరులో సుమారు 8,000 మంది ఉద్యోగులకు అంతర్గత పరీక్షలు విస్తరించినట్లు తెలుస్తోంది. ఈ సేవను ప్రధాన ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో విలీనం చేయనున్నట్లు భావిస్తున్నారు. ఏకార్ట్ ఫుడ్ డెలివరీల కోసం ప్రత్యేక వాహన సముదాయాన్ని నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెస్టారెంట్ జాబితాలలో ONDC భాగస్వాములు, నేరుగా నమోదు చేసుకున్న రెస్టారెంట్లు ఉంటాయని తెలుస్తోంది. దాదాపు 10% ప్రతిపాదిత బేస్ కమిషన్ వ్యాపారం చేసే అవకాశం ఉందని సమాచారం. బెంగళూరులో 'ఈట్-ఇన్ బై మినిట్స్' బ్రాండింగ్ ఉన్న టీ-షర్టులు ధరించిన డెలివరీ రైడర్లు కనిపిస్తున్నారు. ఈ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం చూస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్ తన ప్రస్తుత క్విక్-కామర్స్ సిబ్బందిపై పూర్తిగా ఆధారపడకుండా, ఒక ప్రత్యేక డెలివరీ ఆపరేషన్‌ను సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఫుడ్ డెలివరీ సర్వీస్ తన కమీషన్ విధానం హైలైట్ అని చెబుతోంది.టెక్ క్రంచ్ రిపోర్ట్ పేర్కొంది.

Flip kart

వినియోగదారులు తక్కువ ధరలు మాత్రమే చూడరని.. వినియోగదారులు విస్తృత శ్రేణి రెస్టారెంట్లు, నమ్మకమైన సేవ, వేగవంతమైన డెలివరీలు, సులభమైన మొత్తం అనుభవాన్ని కూడా ఆశిస్తారని గతంలోనే ఫ్లిప్ కార్ట్ చెందిన అధికారులు చెబుతున్నారు. ఈ సర్వీసును దేశవ్యాప్తంగా విస్తరించే ముందు ఫ్లిప్‌కార్ట్ ఈ అన్ని రంగాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుందన్నారు. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ఫుడ్ డెలివరీ కూడా భాగమైతే, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇప్పటికే అందుబాటులో ఉన్న చాలా రెస్టారెంట్లు అందులో కూడా కనిపిస్తాయని వినియోగదారులు సహజంగానే ఆశిస్తారని చేబుతున్నారు. వ్యాపారాన్ని విస్తరిస్తున్న కొద్దీ, కంపెనీ ఒక సమగ్రమైన రెస్టారెంట్ కేటలాగ్‌ను రూపొందించడానికి కృషి చేస్తుందని ఆయన అన్నారు. అమెజాన్ కూడా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలోకి సేవల్లోకి అడుగు పెట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

రాపిడో ఓన్లీ ఫుడ్ డెలవరీ మొదట బెంగళూరులో మొదలు పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందులో స్విగ్గీ, జొమాటో కంటే తక్కువ ధరకే ఆహారం లభిస్తున్నట్లు తెలుస్తోంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+