Milk Price Hike: వినియోగదారులకు షాకిచ్చిన మదర్ డెయిరీ.. పాల ధర లీటర్‎కు రూ.2 నుంచి రూ.4 పెంపు..!

దేశంలో పలు డైరీ సంస్థలు పాల ధరలు, పాల పదార్థాల ధరలు పెంచుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నందిని పాలు, నెయ్యి, వెన్న ధరలు పెంచింది. ఆ తర్వాత అమూల్ కూడా వెన్న, నెయ్యి ధరలు పెంచింది. తాజాగా మోర డైరీ సంస్థ పాల ధరలు పెంచింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో అతిపెద్ద పాల సరఫరాదారు అయిన మదర్ డెయిరీ, లీటరుకు రూ.2-4 మేర పాల ధరలను పెంచింది. ఈ సవరించిన ధరలు నవంబర్ 12, గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. పెరుగుతున్న సేకరణ ఖర్చుల నేపథ్యంలో ఈ ధరల పెంపు చోటుచేసుకుంది.

ఈ డెయిరీ కంపెనీ చివరిసారిగా మే 14, 2026న పాల ధరలను పెంచిన దాదాపు ఆరు నెలల తర్వాత ఈ తాజా ధరల సవరణ జరిగింది. అంతకుముందు ఏప్రిల్ 2025లో ధరలను సవరించింది. ఫుల్ క్రీమ్, టోన్డ్, డబుల్ టోన్డ్ మరియు ఆవు పాలు సహా పలు రకాల పాల ధరలను కంపెనీ పెంచినట్లు ప్రకటించింది. రైతులకు చెల్లించే అధిక సేకరణ ధరల వల్ల కంపెనీ ముడిసరుకు ఖర్చులు పెరిగాయి. దీంతో ఆ అదనపు భారాన్ని కొంతమేర వినియోగదారులపై మోపాల్సి వచ్చింది. మదర్ డెయిరీ తన పాల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు 75-80 శాతాన్ని రైతులకు బదిలీ చేస్తుందని మదర్ డెయిరీ పేర్కొంది.

Mother Dairy

పాల ధరల పెరుగుదల గృహ ఖర్చులను పెంచి, ఇటీవలి నెలల్లో అధికంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణంపై మరింత ఒత్తిడిని పెంచవచ్చు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) కొలమానంతో ఆహార ద్రవ్యోల్బణం ఆగస్టులో 5.97% నుంచి సెప్టెంబర్‌లో 7.74 శాతానికి పెరిగింది. పెరిగిన ఉల్లిపాయలు, ఇతర ఆహార పదార్థాల ధరల కారణంగా భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం కూడా సెప్టెంబర్‌లో 5.54%కి పెరిగింది. వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 4.83 శాతానికి చేరింది.

మదర్ డెయిరీ తన రిటైల్ అవుట్‌లెట్లు, జనరల్ ట్రేడ్ నెట్‌వర్క్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఢిల్లీ-ఎన్‌సిఆర్ మార్కెట్‌లో ప్రతిరోజూ దాదాపు 3.5 మిలియన్ లీటర్ల పాలను విక్రయిస్తుంది. దీని మొత్తం రోజువారీ పాల అమ్మకాలు ఐదు మిలియన్ లీటర్లకు పైగా ఉన్నాయి. పాల ఉత్పత్తులు, వంట నూనెల కోసం బలమైన డిమాండ్ కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్ 17 శాతం పెరిగి రూ.20,300 కోట్లకు చేరినట్లు పేర్కొంది. 1974లో స్థాపించిన మదర్ డెయిరీ నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (NDDB) యాజమాన్య అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. మదర్ డైరీ బ్రాండ్ క్రింద విక్రయించే పాలు, పాల ఉత్పత్తులతో పాటు, ఈ కంపెనీ ధారా బ్రాండ్ క్రింద వంట నూనెలను, సఫల్ బ్రాండ్ క్రింద తాజా పండ్లు, కూరగాయలు, ఫ్రోజెన్ ఫుడ్స్, స్నాక్స్, పల్ప్స్, కాన్సంట్రేట్‌లను మార్కెట్ చేస్తుంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+