TV, AC: పండగ వేళ ప్రజలకు షాక్.. భారీగా పెరగనున్న టీవీ, ఏసీ, వాషింగ్ మెషీన్ల ధరలు..!

ఫెస్టివల్ సీజన్‌కు ముందు ప్రజలకు ప్రముఖ కంపెనీలు షాక్ ఇవ్వనున్నాయి. ఎలక్ట్రానిక్స్ తయారీదారులు ఎయిర్ కండిషనర్లు, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఇతర ఉత్పత్తుల ధరలను 5 శాతం నుంచి 8 శాతానికి పెంచనున్నారు. ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. రాగి, ఉక్కు ధరల పెరుగుదలతో పాటు పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ధరలు పెంచాల్సి వస్తుందని కంపెనీలు చెబుతున్నాయి. కాగా ఈ సంవత్సరంలో ధరల పెంపు ఇది మూడోసారి. తయారీదారులు రాగి, అల్యూమినియం, ఉక్కు, ముడి చమురు ఉత్పత్తు ధరల పెరుగుదల, అధిక సరుకు రవాణా ఖర్చులు కూడా ధరల సవరణకు అనివార్యమయ్యాయని కంపెనీలు వివరించాయి.

ఎయిర్ కండీషనర్ ధరలు 5-8 శాతం పెరగనున్నాయి. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎల్ఈడీ టీవీల ధరలను 3-4 శాతం పెంచుతున్నారని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. బ్లూ స్టార్, గోద్రెజ్ అప్లయన్స్, హైయర్, డైకిన్, సూపర్ ప్లాస్ట్రోనిక్స్ వంటి కంపెనీలు ఇప్పటికే 4-10 శాతం వరకు ధరల పెంపును ప్రకటించాయి. పానాసోనిక్ ఏదైనా పెరుగుదలను నిర్ణయించే ముందు పరిస్థితిని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. హిటాచీ-బ్రాండెడ్ ఎయిర్-కండీషనర్లను కలిగి ఉన్న ఎల్‌జి, బాష్ హోమ్ కంఫర్ట్ కూడా ఎసి ధరలను దాదాపు 5 శాతం పెంచాయి. కమోడిటీ ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే ఏసీలు, డీప్ ఫ్రీజర్ల ధరలు 5-8 శాతం మేర పెరిగాయని బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి త్యాగరాజన్ చెప్పారు.

TV AC

"యుద్ధం కారణంగా అన్ని వస్తువుల ధరలు పెరిగాయన్నారు. రాగి, ఉక్కు మరియు ప్లాస్టిక్‌లు అన్నీ ఖరీదైనవిగా మారాయని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కంపెనీ చేపట్టిన మూడవ ధర పెరుగుదల అని ఆయన అన్నారు. గత ఏడాది పండుగ సీజన్‌తో ధరలను పోల్చి చూస్తే, ఖర్చులు దాదాపు 15 శాతం పెరిగాయన్నారు. గత సవరణ తర్వాత వస్తువుల ధరలు 8-10 శాతం పెరిగిన తర్వాత పరిశ్రమ వ్యాప్తంగా మరో రౌండ్ ధరల పెరుగుదల అనివార్యమైందని గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ అప్లయెన్సెస్ బిజినెస్ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది అన్నారు.

తాము ధరల పెంపును నివారించినట్లయితే నష్టపోతాము, తాము ధరలను పెంచినట్లయితే, అమ్మకాలు కొద్దిగా ప్రభావితం కావచ్చని హైయర్ ఇండియా ప్రెసిడెంట్ NS సతీష్ తెలిపారు. ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతూ ఉంటే దీపావళి తర్వాత జనవరిలో మళ్లీ ధరలను పెంచే అవకాశం ఉందని సతీష్ చెప్పారు. అంతేకాకుండా, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఇతర విభాగాలలో 2-3 శాతం ధరల పెంపును ఉంటుందన్నారు. పండుగ సీజన్‌ ముందు ఈ పెంపు చేపట్టినప్పటికీ.. డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద పాత ధరలకే కొనుగోలు చేసిన సరకు ఉందని కంపెనీలు గుర్తు చేశాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+