IT News: ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు అధికమయ్యాయి. పరిస్థితి చక్కబడింది అనుకునే సమయానికి కొత్త సంస్థలు ఈ లిస్టులో చేరడం మొదలుపెట్టాయి. 2020లో మొదటిసారి కరోనా వ్యాపించిన నాటి నుంచి టెక్ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొవిడ్ సంక్షోభం మొదలుకొని ఇప్పటి వరకు గమనిస్తే, ఈ ఏడాది జనవరిలోనే అత్యధిక లేఆఫ్ లు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఒక్క జనవరిలోనే..
ఆర్థిక అనిశ్చితి వల్ల ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలతో పాటు స్టార్టప్ లు సైతం ఉద్యోగాల్లో కొత పెడుతున్నాయి. గత సంవత్సరం రికార్డును అధిగమిస్తూ, ఈ ఏడాది మొదటి రెండు నెలల్లోనే ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా కొనసాగినట్లు లేఆఫ్స్ అనే వెబ్ సైట్ తెలిపింది. ఒక్క జనవరిలోనే 268 కంపెనీల్లో దాదాపు 85 వేల మంది కొలువులు కోల్పోయినట్లు ఆ సంస్థ నివేదించింది. ప్రస్తుత ఫిబ్రవరిలో ఇప్పటివరకు 104 కంపెనీల్లో సుమారు 23 వేల మంది ప్రభావితం అయ్యి ఉంటారని అంచనా వేసింది.

పెద్ద కంపెనీలు సైతం..
జూమ్, గూగుల్, మైక్రోసాఫ్ట్, లింక్డ్ ఇన్, హెచ్ పి, టిక్ టాక్, యాహూ, డెల్ వంటి పెద్ద టెక్ కంపెనీలు సహా పలు ఇతర సంస్థలు ఈ ఏడాది లేఆఫ్ లు ప్రకటించాయి. విదేశాలతో పాటు భారతదేశంలోనూ వేలాది మంది ఉద్యోగులను ఆయా సంస్థలు వదిలించుకున్నాయి. గత నవంబరులోనే మొత్తం 2017 కంపెనీల్లో దాదాపు 52 వేల మంది కొలువు కోల్పోయారు. 2020లో కొవిడ్ ఉధృతిగా ఉన్న సమయంలోనూ 428 టెక్ సంస్థలు తమ 60 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

పేరులోనే కాదు తొలగించడంలోనూ దిట్టే:
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగులను రికార్డు స్థాయిలో గూగుల్ తొలగించింది. మొత్తంగా 31 వేల మంది తొలగింపుతో మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వరుసగా రెండు, మూడు, నాల్గవ స్థానంలో నిలిచాయి. ఇవిగాక ఒక్క 2023లోనే దాదాపు లక్షా 10 వేలమంది సిబ్బందిని ఎటువంటి సంకేతాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు, స్టార్టప్ లు తొలగిచినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

స్టార్టప్ లకు పెద్ద దెబ్బ:
చాలావరకు యూనికార్న్ లు, ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్ లు నిధుల కొరత కారణంగా ఉద్యోగుల తొలగింపు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఎడ్ టెక్, ఫిన్ టెక్, హైపర్ లోకల్ డెలివరీ, కంటెంట్, గేమింగ్, లాజిస్టిక్స్, ఆన్ లైన్ ఈ-కామర్స్ లోని స్టార్టప్ లు దారుణంగా ప్రభావితమయైనట్లు నివేదిక పేర్కొంది. కొన్ని అంచనాల ప్రకారం, 2022లో 14 ఎడ్ టెక్ స్టార్టప్ లు దాదాపు 7 వేల మందికి ఉద్వాసన పలికాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications