అగ్రరాజ్యం అమెరికాలో అక్టోబర్ నెలలో ఉద్యోగ కోతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. US యజమానులు అక్టోబర్‌లో 1,53,074 ఉద్యోగాల కోతలను ప్రకటించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 175 శాతం అధికం. ఈ స్థాయి తొలగింపులు 2003 తర్వాత తొలిసారి నమోదవడం గమనార్హం. కంపెనీలు డబ్బు ఆదా చేయడం, వ్యయాలను తగ్గించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత మార్పులకు సిద్ధమవ్వడం వల్ల ఈ భారీ ఉద్యోగ కోతలు చోటుచేసుకున్నాయి. ది కోబీస్సీ లెటర్ పేర్కొన్నట్లుగా, AI స్వీకరణ, ఆటోమేషన్ కారణంగా కంపెనీలు పునర్వ్యవస్థీకరణ దిశగా వెళ్తున్నాయి.
2025 మొదటి 10 నెలల్లో అమెరికన్ సంస్థలు 1.09 మిలియన్ Layoffs ప్రకటించాయి. ఇది 2024 మొత్తం 7.61 లక్షల కోతలతో పోలిస్తే 44 శాతం అధికం.బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, టెక్నాలజీ కంపెనీలు ఈ సారి తొలగింపుల్లో ముందంజలో ఉన్నాయి. గిడ్డంగులు, లాజిస్టిక్స్, రిటైల్ రంగాలు కూడా ప్రభావితమయ్యాయి. ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఆండీ ఛాలెంజర్ మాట్లాడుతూ.. అక్టోబర్‌లో ఉద్యోగాల కోత వేగం సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంది. మహమ్మారి సమయంలో అధిక నియామకాల తర్వాత అనేక రంగాలు ఇప్పుడు సర్దుబాటు దశలో ఉన్నాయని తెలిపారు.

AI స్వీకరణ, పెరుగుతున్న ఖర్చులు, బలహీనమైన వినియోగదారు ఖర్చులు కంపెనీలను బడ్జెట్ పరిమితులకు నెట్టుతున్నాయి. ఇప్పుడు తొలగించబడిన వారు కొత్త ఉద్యోగాలు త్వరగా పొందడం కష్టతరం అవుతోందని ఆయన హెచ్చరించారు. ఇది అమెరికా కార్మిక మార్కెట్ మరింత సడలించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో అమెజాన్, టార్గెట్, UPS, మెటా, పారామౌంట్ స్కైడాన్స్ వంటి ప్రధాన సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. ఇది 2020 మహమ్మారి తర్వాత అత్యధిక స్థాయి తొలగింపులుగా నమోదయింది.
అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా లేబర్ డిపార్ట్‌మెంట్ ఇటీవల ఉద్యోగ డేటాను విడుదల చేయలేకపోయింది. దీంతో సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు అధికారిక నిరుద్యోగ గణాంకాలు లేవు. అయితే ఆగస్టు డేటా ప్రకారం నిరుద్యోగ రేటు 4.3 శాతం వద్ద ఉంది. ఇది స్థిరంగా ఉన్నప్పటికీ, కొత్త నియామకాల వేగం తగ్గుతోందని సూచించింది. ప్రైవేట్ రీసెర్చ్ సంస్థ ADP రీసెర్చ్ ప్రకారం, అక్టోబర్‌లో ప్రైవేట్ యజమానులు కేవలం 42 వేల ఉద్యోగాలను మాత్రమే జోడించారు. ఇది నియామకాల్లో బలహీనత కొనసాగుతున్నదని సూచిస్తోంది. 2025 అక్టోబర్ నాటికి యజమానులు ప్రకటించిన కొత్త నియామకాల ప్రణాళికలు కేవలం 4.88 లక్షలు. ఇది 2011 తర్వాత కనిష్ఠ స్థాయిగా నమోదైంది.
ఆండీ ఛాలెంజర్ వ్యాఖ్యానిస్తూ.. 2012 తర్వాత ఇది అత్యల్ప సీజనల్ నియామకాల ప్రణాళిక. కంపెనీలు చివరి త్రైమాసికంలో కొంత ఉత్సాహం చూపవచ్చునేమో కానీ 2025లో బలమైన సీజనల్ హైరింగ్ వాతావరణం కనిపించడం అసాధ్యమని అన్నారు. 2003తో ప్రస్తుత పరిస్థితిని పోలుస్తూ..అప్పట్లో మొబైల్ ఫోన్లు ఉద్యోగాలకు అంతరాయం కలిగించాయి. ఇప్పుడు అదే విధంగా AI పరిశ్రమలను పునర్నిర్మిస్తోందని వ్యాఖ్యానించారు.
విశ్లేషకులు చెబుతున్నట్లు, ఈ భారీ తొలగింపులు అమెరికా ఉద్యోగ మార్కెట్ ఆరోగ్యంపై కొత్త భయాలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా, కొత్తగా నిరుద్యోగులైన వారు తక్కువ ఉద్యోగ ఖాళీలతో ఎదుర్కొంటున్నందున ఉద్యోగావకాశాలు మరింత కష్టతరమవుతున్నాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం..ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఇటీవల చేసిన కార్మిక మార్కెట్ క్రమంగా చల్లబడుతోంది అన్న వ్యాఖ్యకు ఈ నివేదిక విరుద్ధంగా ఉందని తెలిపింది. ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా ఆర్థికవేత్తలు ప్రస్తుతం ADP, రెవెలియో ల్యాబ్స్ వంటి ప్రైవేట్ డేటాపై ఆధారపడుతున్నారు.
ఏదేమైనా అక్టోబర్ 2025లో అమెరికా ఉద్యోగ మార్కెట్ AI, ఖర్చు తగ్గింపు, ఆర్థిక మందగమనం ప్రభావంతో 22 ఏళ్లలో వరెస్ట్ స్థితిని ఎదుర్కొంటోంది. ఇది భవిష్యత్‌లో గ్లోబల్ లేబర్ ట్రెండ్‌లకు కీలక మలుపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications