ఐబీఎం ఉద్యోగులకు షాక్: వేలాది ఉద్యోగాలకు ఎసరు.. భారత్‌లోనూ ప్రభావం..!

ఉదోగాల కోతల సెగ ఇప్పుడు ఐటీ రంగంలో విజృంభిస్తుంది. నిన్న, మొన్నటిదాకా ప్రముఖ దిగ్గజ కంపెనీలు తొలగింపులు ప్రకటించాక ఇప్పుడు మరో కంపెనీ తొలగింపులపై వార్తలు వచ్చాయి. అయితే ఈ ఏడాది మొదటి నుండి దాదాపు ప్రతి రంగంలోని కంపెనీలు ఏదో ఒక కారణంగా వర్క్ ఫోర్స్ తగ్గించుకుంటున్నాయి. ఈ తరుణంలోనే దిగ్గజ ఐటీ కంపెనీ ఐబీఎం నుంచి ఉద్యోగుల తొలగింపు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ తొలగింపులు కంపెనీకి మొదటిసారి కాదు, గత సంవత్సరం కూడా IBM నుండి ఇలాంటి వార్తలు వచ్చాయి.

Layoffs 2025 IBM employees In THESE Areas May Face Job Cuts How will this impact India

ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ IBM అనేది అమెరికన్ టెక్ దిగ్గజం. ఈ కంపెనీ ఉద్యోగాల కోతలు ముఖ్యంగా క్లౌడ్ క్లాసిక్ విభాగాన్ని ప్రభావితం చేయనుంది, 'ది రిజిస్టర్' నివేదిక ప్రకారం, దాదాపు 9 వేల మంది ఉద్యోగులు ఈ నిర్ణయంతో ప్రభావితమవుతారని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. IBM SoftLayerను కొనుగోలు చేసిన తర్వాత 2013లో క్లౌడ్ క్లాసిక్ ఏర్పడింది. IBMకి ఇండియాలో కూడా ఆఫీస్ ఉంది. అయితే, ఈ తొలగింపుల వల్ల కంపెనీ భారతీయ ఉద్యోగులు ప్రభావితమవుతారా లేదా అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. అయితే IBM కంపెనీ విధానాలను మారుస్తోందని కూడా నివేదిక పేర్కొంది. ఇటీవల ఉద్యోగం నుండి తొలగించిన ఒక మాజీ IBM ఉద్యోగి ది రిజిస్టర్‌తో మాట్లాడుతూ కంపెనీ క్లౌడ్ విభాగంలో దాదాపు 10% కోతల వల్ల ప్రభావితమైందని చెప్పారు.

రాలీ, నార్త్ కరోలినా, న్యూయార్క్ సిటీ & స్టేట్, డల్లాస్, టెక్సాస్ అండ్ కాలిఫోర్నియాలో తొలగింపుల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయని నివేదిక పేర్కొంది. ప్రభావితమైన విభాగాలలో కన్సల్టింగ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేల్స్ అండ్ ఇంటర్నల్ ఐటీ సిస్టంలు ఉన్నాయి. మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్లలో కూడా IBM తొలగింపులు చేసినట్లు వెల్లడైంది. కొంతమంది ఉద్యోగులు పర్సనల్ నోటిఫికేషన్ల ద్వారా ఈ తొలగింపు గురించి తెలుసుకున్నారని, మరికొందరికి ఇంటర్నల్ మీటింగ్స్ సమయంలో సమాచారం అందించినట్లు వర్గాలు చెబుతున్నాయి.

Take a Poll

రిటర్న్-టు-ఆఫీస్ విధానాలు: IBM ఉద్యోగులు ఇప్పుడు కొత్త రిటర్న్-టు-ఆఫీస్ విధానాలను అనుసరించాల్సి ఉంది, అంటే ఏప్రిల్ చివరి నాటికి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ రావడం తప్పనిసరి.

IBM గురించి: IBM లేదా బిగ్ బ్లూ అనేది న్యూయార్క్‌లోని అర్మోంక్‌లో ఉన్న ఒక మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ. 1911లో కంప్యూటింగ్-టాబులేటింగ్-రికార్డింగ్ కంపెనీ (CTR)గా ఏర్పడింది అలాగే 1924లో IBMగా పేరు మార్చబడింది. IBM ప్రపంచంలోని ప్రముఖ సమాచార సాంకేతిక సంస్థలలో ఒకటి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+