ఆరు నెలల్లో లక్ష మంది ఉద్యోగులు రోడ్డు మీదకు.. ఇంకా వెంటాడుతున్న లేఆప్స్ భయాలు

ప్రపంచవ్యాప్తంగా లేఆప్స్ ఆగడం లేదు. కరోనా మహమ్మారి నుంచి మొదలు పెడితే నేటి వరకు అన్ని రంగాల్లో కంపెనీలు ఉద్యోగులను తీసివేశాయి. ఇంకా తీసివేస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది లేఆప్స్ ఉండవు అనుకుంటే ఉద్యోగ తొలగింపులు భారీస్థాయిలో జరగబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. 2025లో టెక్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోంది. దీంతో ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు ప్రముఖ కంపెనీలు రెడీ అవుతున్నాయి. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో కంపెనీలు ఇప్పటికే కాస్ట్ కటింగ్ ప్రారంభించాయి. కేవలం ఆరు నెలల కాలంలోనే లక్ష మంది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చారు. ఇంకా ఆరు నెలల సమయం ఉంది ఈ ఏడాదికి..ఇంకెంతమంది రోడ్డు మీదకు వస్తారోననే ఆందోళన కనిపిస్తోంది ఇప్పుడు.

ఇక AI రాకతో ఉద్యోగుల నెత్తిన పిడుగు పడినట్లయింది. ప్రపంచవ్యాప్తంగా, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా వంటి ప్రధాన కంపెనీలు ఏఐ వాడకంతో తమ ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకున్నాయి. గత ఆరు నెలల్లోనే ఈ కంపెనీలు 76,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను జాబ్ నుండి తొలగించాయి. కొన్ని పెద్ద నాన్-టెక్ కంపెనీలను కూడా మనం పరిగణనలోకి తీసుకుంటే, మొత్తం ఉద్యోగుల తొలగింపుల సంఖ్య ఈ ఏడాది లక్ష కంటే ఎక్కువగానే ఉంది.

Massive Job Cuts in 2025 2025 layoffs India over 1 lakh jobs lost tech layoffs 2025 non-tech job cuts 2025 job loss reasons 2025 workforce reduction India AI job impact 2025 mass layoffs in IT companies job market crisis 2025 employment news India 2025 hiring freeze and layoffs 2025 2025 - 2025 AI 2025 2025 2025 Over 1 lakh jobs gone in 2025

సాఫ్ట్‌వేర్ కంపెనీల నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ఫిన్‌టెక్ స్టార్టప్‌ల వరకు అనేక కంపెనీలు ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్నాయి. కృత్రిమ మేధస్సు (AI)లో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. దీని ఫలితంగా, పదివేల మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఇప్పుడు పెరుగుతున్న AIతో తమ ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

కొత్త CEO లిప్-బు టాన్ ఆధ్వర్యంలోని ఇంటెల్ తన ఉద్యోగులలో దాదాపు 20% లేదా 25,000 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోంది. ఈ ఉద్యోగ కోతల్లో ఎక్కువ భాగం దాని ఫౌండ్రీ విభాగాన్ని ప్రభావితం చేయనుంది. టెక్ ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సింగిల్-కంపెనీ తొలగింపులలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక మరో దిగ్గజం పానాసోనిక్ 10,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు రెడీ అవుతోంది. కోతల్లో సగం జపాన్‌లో ఉండగా మిగిలినవి ఇతర దేశాలలో ఉండనున్నాయ. టెలివిజన్లు, పారిశ్రామిక పరికరాలు వంటి సాంప్రదాయ ఉత్పత్తుల నుండి కంపెనీ తన దృష్టిని AI వంటి భవిష్యత్ విభాగాలకు మార్చే వ్యూహం చేస్తోంది.

ఇక మరో దిగ్గజం మైక్రోసాఫ్ట్ మే నెలలో ప్రపంచవ్యాప్తంగా 6,500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది.జూలైలో అమ్మకాలు, మార్కెటింగ్ బృందాలే లక్ష్యంగా మరో రౌండ్ తొలగింపులు జరగనున్నాయి. కంపెనీ ఇప్పుడు తన దృష్టిని ఏఐ మీదకు మళ్లించింది. ఇక మరో దిగ్గజం మెటా తన 3,600 మంది ఉద్యోగులలో దాదాపు 5% మందిని తొలగించింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన తొలగింపులు ఫేస్‌బుక్, హారిజన్ VR మరియు లాజిస్టిక్స్ బృందాలను ప్రభావితం చేశాయి.

ఇక గూగుల్ కూడా అనేక రౌండ్ల తొలగింపులు మధ్య ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. మరో రౌండ్ తొలగింపులకు రెడీ అవుతోంది. అమెజాన్ కూడా ఏఐలో పెట్టుబడులు పెడుతూ ఉద్యోగాలను ఇంటికి సాగనంపేందుకు రెడీ అవుతోంది. మరో దిగ్గజం బ్లూ ఆరిజిన్ 1,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించింది. మరో టెక్ దిగ్గజం IBM 8,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. మరో టెక్ దిగ్గజం HP కంపెనీ పునర్నిర్మాణంలో భాగంగా 6,000 మందిపై వేటు వేసింది. అలాగే బ్లాక్ 1000 మందిని, క్రౌడ్‌స్ట్రైక్ మంది ఉద్యోగులను తొలగించింది.

నాన్-టెక్ కంపెనీలలో లేఆప్స్ విషయానికి వస్తే.. ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. AI-ఆధారిత సేవలలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. టిండెర్, హింజ్ యొక్క మాతృ సంస్థ అయిన మ్యాచ్ గ్రూప్ 325 మంది ఉద్యోగులపై వేటు వేసింది. క్లుప్తంగా చెప్పాలంటే 2025లో ఇప్పటివరకు, టెక్ రంగంలో తొలగింపులు 100,000 దాటాయి. ఇంకా లేఆప్స్ కొనసాగనున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+