మైక్రోసాఫ్ట్‌లో దాదాపు 20 సంవత్సరాల పాటు అంకితభావంతో పనిచేసిన 62 ఏళ్ల జో ఫ్రెండ్ అనే ఉద్యోగి తన జీవితంలో ఊహించని మలుపును ఎదుర్కున్నాడు. అతను ఎప్పుడూ స్థిరమైన ఉద్యోగం, భద్రమైన భవిష్యత్తు, గౌరవనీయమైన పదవీ విరమణను కలగా కనేవాడు. అయితే 2025 మే నెలలో జరిగిన పెద్దఎత్తున ఉద్యోగాల కోత (layoff) అతని ఆ కలను ఒక్కసారిగా ధ్వంసం చేసింది. రెండు దశాబ్దాల అనుభవం, కంపెనీ పట్ల నిబద్ధత ఉన్నప్పటికీ, అతనికి వచ్చినఉద్యోగ విరమణ మెయిల్ అతని మనసును బలంగా తాకింది.
జో ఫ్రెండ్ మైక్రోసాఫ్ట్‌లో ఉత్పత్తి నిర్వహణ డైరెక్టర్ (Director of Product Management) గా పనిచేశాడు. తొమ్మిది మందితో కూడిన తన బృందాన్ని సమర్థవంతంగా నడిపించేవాడు. గత సంవత్సరం చివర్లో కంపెనీలో పునర్వ్యవస్థీకరణ (restructuring) జరుగుతుందనే మాటలు వినిపించాయి. అయినప్పటికీ, తన ఉద్యోగం ప్రమాదంలో ఉందని అతనికి అనుమానం కూడా రాలేదు. అయితే మే నెలలో, కంపెనీ 6 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. వారిలో జో కూడా ఒకరు.

నిజం చెప్పాలంటే, ఉద్యోగాల కోత జరుగుతుందని నాకు తెలుసు, కానీ నేను కూడా దానిలో భాగమవుతానని ఊహించలేదుని జో ఫ్రెండ్ బిజినెస్ ఇన్‌సైడర్‌తో చెప్పాడు. ఈ నిర్ణయం అతనికి ' కంపెనీ ద్రోహం' (betrayal) లాగా అనిపించింది. 20 సంవత్సరాల విశ్వాసం తర్వాత.. ఇలా ఒక్కసారిగా ఉద్యోగం పోవడం నిజంగా బాధాకరమని ఆయన అన్నారు.
మైక్రోసాఫ్ట్ ప్రతినిధుల ప్రకారం.. ఈ లేఆఫ్స్ ఉద్దేశం నిర్వహణ స్థాయిలను తగ్గించి సామర్థ్యాన్ని మెరుగుపరచడం. అయితే ఈ కంపెనీ మాత్రమే కాదు గూగుల్, అమెజాన్, ఇంటెల్వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఇటీవల తమ మధ్యస్థాయి మేనేజర్లను తొలగించాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు తగ్గించకపోయినా, వైట్ కాలర్ టెక్ వర్కర్లపై ఒత్తిడి పెరుగుతోంది. చాలా మంది కొత్త ఉద్యోగాలను వెతికే ప్రయత్నంలో ఉన్నప్పటికీ, మార్కెట్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. జో ఫ్రెండ్ తనకు అందిన సేవరెన్స్ ప్యాకేజ్ (severance package) గురించి మాట్లాడుతూ.. కంపెనీ నాకు దాదాపు ఒక సంవత్సరపు జీతానికి సమానమైన చెల్లింపు చేసింది. ఆర్థికంగా కాస్త సౌకర్యం ఉన్నా, భావోద్వేగంగా మాత్రం దెబ్బ తిన్నానని అన్నారు.
తర్వాత అతను ఒక ఆర్థిక సలహాదారుడిని కలసి ముందస్తు పదవీ విరమణ (early retirement) అవకాశాలను పరిశీలించాడు. నాకు కొన్నిసార్లు కొత్త ఉద్యోగాల ఆఫర్లు వచ్చాయి, కానీ అవేవీ సరైనవి అనిపించలేదని ఆయన వెల్లడించాడు. ప్రస్తుతం జో తనను సెమీ రిటైర్డ్ (semi-retired) గా భావిస్తూ, ఒక యువ వ్యవస్థాపకుడికి మార్గదర్శకత్వం వహిస్తున్నాడు.ఇప్పుడు నాకు డబ్బు ముఖ్యం కాదు; ఎవరో ఒకరి జీవితాన్ని మార్చే అవకాశం నాకు లభిస్తే చాలని అన్నారు.
జో, అతని భార్య ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ, అతనికి ఆత్మగౌరవం, ఉద్యోగ భద్రత నష్టం కలిగిందని ఆయన ఒప్పుకున్నాడు. మైక్రోసాఫ్ట్‌లో కష్టపడి పనిచేస్తే ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుందని నమ్మేవాడిని. కానీ ఇప్పుడు అర్థమైంది. టెక్ ప్రపంచంలో విశ్వాసం కంటే లాభాలు ముఖ్యమైపోయాయని బాధతో చెప్పారు. జో కథ కేవలం ఒక వ్యక్తి ఉద్యోగ నష్టానికే కాకుండా, ఇప్పటి టెక్ పరిశ్రమలో మారుతున్న విలువల ప్రతిబింబంగా నిలిచింది. విశ్వాసం, నిబద్ధత, అనుభవం ఇవన్నీ కూడా "పునర్వ్యవస్థీకరణ" అనే ఒక్క మాటలో మాయం అవుతున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications