Starbucks: స్టార్‌బక్స్ సీఈఓగా భారత సంతతి వ్యక్తి.. ఎవరంటే..
భారతీయ సంతతికి చెందిన మరో వ్యక్తి ప్రపంచ అతిపెద్ద కాఫీ చైన్ స్టార్‌బక్స్ సీఈఓగా నియమితులయ్యారు. లక్ష్మణ్ నరసింహన్‌ను కంపెనీ సీఈవో నియమిస్తున్నట్లు స్టార్‌బక్స్ గురువారం తెలిపింది. డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, మ్యూసినెక్స్ కోల్డ్ సిరప్‌లను కూడా తయారు చేసే రెకిట్‌కు ప్రస్తుతం నరసింహన్ CEOగా ఉన్నారు.

ఏప్రిల్ 2023
అతను ఆ పదవి నుండి నిష్క్రమిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. దీంతో FTSE-లిస్టెడ్ రెకిట్ షేర్లు 4% పడిపోయాయి. నరసింహన్ అక్టోబర్‌లో స్టార్‌బక్స్‌లో చేరనున్నారు. అయితే బారిస్టాలకు మెరుగైన వేతనాలు చెల్లించడం, ఉద్యోగుల సంక్షేమం, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం వంటి వాటి గురించి కొన్ని నెలల పాటు కంపెనీ, దాని "రీఇన్వెన్షన్" ప్లాన్ గురించి తెలుసుకున్న తర్వాత, ఏప్రిల్ 2023లో బాధ్యతలు చేపడతారు.

రెకిట్
నరసింహన్ సెప్టెంబరు 2019లో రెకిట్‌లో చేరారు. 1999లో రెకిట్‌ను ఏర్పాటు చేసినప్పటి నుంచి దానిలో సీఈవోగా పనిచేసిన మొదటి బయట వ్యక్తిగా నరసింహన్ ఉన్నారు. నరసింహన్ షుల్ట్జ్, మేనేజ్‌మెంట్ టీమ్‌తో తన సమయాన్ని వెచ్చిస్తారని, బరిస్టాగా సమయాన్ని వెచ్చిస్తారని, ఉద్యోగులను కలుసుకుంటారని, పరివర్తన కాలంలో తయారీ ప్లాంట్లు, కాఫీ ఫామ్‌లను సందర్శిస్తారని స్టార్‌బక్స్ తెలిపింది.

పెప్సికోలో గ్లోబల్
గతంలో పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన నరసొంహన్ అమ్మకాలు క్షీణించిన సందర్బంలో కంపెనీని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే కాఫీ దిగ్గజం నరసింహన్‌ను తమ కీలక అధికారిగా నియమించుకుంది. ముఖ్యంగా ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 20 వేలకు పైగా స్టార్‌బక్స్ ఔట్‌లెట్స్ తెరవాలన్న టార్గెట్‌ను చేరుకునేందుకు సరియైన వ్యక్తిగా నరసింహన్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications