Gold Demand: బంగారానికి తగ్గుతున్న డిమాండ్.. భారత్‌లో మాత్రం రేటు పెరుగుతోంది.. విషయం ఏంటంటే..
Gold Demand: గత కొన్ని నెలలుగా బంగారం కొంత తగ్గినట్లు కనిపించినప్పటికీ మళ్లీ మూడు వారాలుగా రేటు క్రమంగా పెరగటం ప్రారంభించింది. ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరుగుతోంది. దేశంలో 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం 50 వేలకు పైగా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ తగ్గడానికి ఇదే కారణం కావచ్చు. అయితే.. ఈ ఏడాది మెుదటి క్వార్టర్ బంగారం డిమాండ్ ను పరిశీలిస్తే అది భారీగా పెరిగింది.

ఎంత డిమాండ్ పెరిగిందంటే..?
ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో దేశంలో బంగారం డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 43 శాతం ఎక్కువగా ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన తాజా నివేదికలో వెల్లడించింది . ప్రస్తుతం.. ద్రవ్యోల్బణం, రూపాయి-డాలర్ రేట్లు, పాలసీ మార్పులు సహా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇవి వినియోగదారుల తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలో బంగారం డిమాండ్ 170.7 టన్నులుగా ఉంది. ఇది 2021 అదే కాలంలో ఉన్న 119.6 టన్నుల డిమాండ్ కంటే.. దాదాపుగా 43 శాతం ఎక్కువని తేలింది.

ఎన్ని కోట్ల విలువ అంటే..?
బంగారం డిమాండ్‌పై వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గురువారం ఒక నివేదికను విడుదల చేసింది . దీని నివేదిక ప్రకారం.. జూన్ త్రైమాసికంలో భారత్‌లో బంగారం డిమాండ్ 54 శాతం పెరిగి రూ.79,270 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం అంటే 2020-2021 సంవత్సరం మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్ రూ.51,540 కోట్లుగా ఉంది.

అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సమయంలో..
అక్షయ తృతీయ, మ్యాట్రిమోనియల్ సీజన్ ప్రారంభం కావడంతో ఆభరణాల డిమాండ్ 49 శాతం పెరిగి 140.3 టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ CEO సోమసుందరం వెల్లడించారు. 800-850 టన్నుల డిమాండ్ ఉండవచ్చని అంచనా వేశారు. అయితే.. ద్రవ్యోల్బణం, బంగారం ధర, రూపాయి-డాలర్ రేట్లతో పాటు మరిన్ని కారణాల వల్ల వినియోగదారుల నుంచి డిమాండ్ ప్రభావితం అవుతుందని అంచనాలు చెబుతున్నాయి. 2021 క్యాలెండర్ ఇయర్‌లో మొత్తం బంగారం డిమాండ్ 797 టన్నులుగా ఉందని తెలియజేశారు.

పెరిగిన బంగారం రీసైక్లింగ్..
జూన్ త్రైమాసికంలో.. దేశంలో బంగారం రీసైక్లింగ్ 18 శాతం పెరిగి 23.3 టన్నులకు చేరుకుంది. గతేడాది.. ఇదే కాలంలో రీసైక్లింగ్ 19.7 టన్నులుగా ఉంది. బంగారం దిగుమతులు కూడా 2021 ఇదే కాలానికి 131.6 టన్నుల నుంచి 34 శాతం పెరిగి 170 టన్నులకు చేరుకున్నాయి.

తగ్గిన గ్లోబల్ డిమాండ్..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. బంగారం కోసం ప్రపంచ డిమాండ్ ఏడాది ప్రాతిపదికన ఎనిమిది శాతం తగ్గి 948.4కి చేరుకుంది. 2021 జూన్ త్రైమాసికంలో ఇది 1,031.8 టన్నులుగా ఉంది. 2022 ద్వితీయార్ధంలో బంగారం విషయంలో నష్టాలు, అవకాశాలు రెండూ ఉన్నాయని WGCలోని సీనియర్ విశ్లేషకుడు ఎమ్మా లూయిస్ స్ట్రీట్ అన్నారు. "సురక్షితమైన పెట్టుబడిగా, బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ద్రవ్యపరమైన మరింత కఠినతరం, డాలర్ మరింత బలపడటం వంటి సవాళ్లు కూడా బంగారం డిమాండ్ పై ఉన్నాయి.


Click it and Unblock the Notifications