india us trade deal: భారత్ అమెరికా మధ్య త్వరలోనే ట్రేడ్ డీల్ జరగబోతోందని అమెరికా నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డైరక్టర్ ఇటీవల పేర్కొన్నారు. అయితే అసలు దీనికి గల కారణాలేంటి? అమెరికా భారత్ ను తక్కువ అంచనా వేసిందా? తిరిగి ట్రేడ్ డీల్ దిశగా అడుగులు వేయడానికి దోహదపడిన అంశాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికా ఊహించినదానికంటే మరింత బలంగా ఇండియన్ ఎకానమీ ఉంది. పైగా ట్రంప్ టారిఫ్ లు ఇండియా ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపలేదు. తిరిగి అమెరికాకే కొంత నష్టం చేకూర్చాయి. ఎగుమతులు ఆగిపోవడంతో అమెరికాలో నిత్యావసరాల కొరత ఏర్పడింది. అక్కడ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే దీని ఎఫెక్ట్ భారత్ పై కూడా కొంత ఉంది. దాంతో సీన్ రివర్స్ అయింది. తిరిగి ట్రేడ్ చేసుకునే దిశగా రెండు దేశాలు అడుగులు వేస్తున్నాయి.
చూపించని టారిఫ్‌ల ప్రభావం
భారతీయ దిగుమతులపై అమెరికా 50% వరకు టారిఫ్‌లు విధించినప్పటికీ న్యూ ఢిల్లీ నుండి అమెరికాకు జరిగే సరుకు రవాణాలో అంచనా వేసినంత భారీ తగ్గుదల కనిపించలేదు. ట్రంప్ 50% టారిఫ్‌ను విధించిన మొదటి నెల సెప్టెంబరులో 12% క్షీణత కనిపించింది. ఆ తర్వాత అక్టోబరులో అమెరికాకు భారతీయ ఎగుమతులు 8.6% మాత్రమే తగ్గాయి. మరోపక్క జపాన్, దక్షిణ కొరియా వంటి ఇతర ఆసియా దేశాలు ఇప్పటికే వాషింగ్టన్‌తో సుంకాలు తగ్గించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ భారత్ మాత్రం "వెయిట్ అండ్ సీ" ధోరణిని కొనసాగిస్తోంది.
భారత్ వ్యూహం ఇదే..
భారత్.. అవసరమైతే వేచి ఉండటానికి సిద్ధం అన్నట్టు వ్యవహరిస్తోంది. వస్త్ర పరిశ్రమ వంటి కొన్ని రంగాలు ఆర్డర్‌లలో తగ్గుదల చూసినప్పటికీ, ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపలేదని భారత ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ వెయిట్ అండ్ సీ పాలసీ పని చేసినట్టుంది. కొంత కాలానికి ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి విధించిన 25% సుంకాన్ని అమెరికా వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. టారిఫ్‌లు చివరికి 15% వరకు తగ్గే అవకాశం ఉంది. దీనికి ప్రతిగా వ్యవసాయం వంటి సున్నితమైన రంగాలకు రక్షణ కల్పిస్తూనే, 80% కంటే ఎక్కువ వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించడానికి భారత్ కూడా సిద్ధంగా ఉంది.
ఇప్పటికే భారీ ఊరట
ఈ నెల 12 న దాదాపు 200 రకాల ఆహార ఉత్పత్తులపై సుంకాన్ని తొలగిస్తూ అమెరికా ఆర్డర్ జారీ చేయడం భారత్ కు కాస్త ఉపశమనం కలిగించింది. పన్ను మినహాయించిన వాటిల్లో కాఫీ, టీ, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, మాంసం వంటివి ఉన్నాయి. టారిఫ్ లు పెంచడం వల్ల అమెరికాలో ధరలు పెరిగి ఇన్‌ఫ్లేషన్ రావడంతో ట్రంప్ ఈ నిర్ణయానికి వచ్చారు.
అమెరికా ముఖ్యమే..
ఎంతలేదన్నా భారత్ కు అమెరికా ముఖ్యమే. మనదేశానికి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంటూ వస్తోంది. మన ఎగుమతుల్లో 18% అమెరికాకు వెళ్తాయి. 2030 నాటికి ఇరుదేశాల మధ్య 500 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరగాలని ఇరుదేశాలు ఆశిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాల వల్ల దీనికి తాత్కాలిక అడ్డంకులు ఏర్పడినా త్వరలో వాణిజ్య ఒప్పందం కుదిరి.. మళ్లీ రెండు దేశాల మధ్య ట్రేడ్ విస్తరిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఆల్టర్నేటివ్ ఉంది
ఇకపోతే భారత్ ఇప్పటికే ఆల్టర్నేటివ్స్ చూస్తోంది. భారత ఎగుమతిదారులు అమెరికాలో తగ్గిన డిమాండ్‌ను ఆఫ్రికా, యూరోపియన్ మార్కెట్‌లకు విస్తరించడం ద్వారా భర్తీ చేసుకున్నారు. అమెరికన్ కస్టమర్‌లను నిలుపుకోవడానికి తగ్గింపులు, ఈజీ డెలివరీ షెడ్యూల్స్ వంటివి చేస్తు్న్నారు.
More From GoodReturns

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Strait of Hormuz: స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటే ఏమిటి? దీన్ని బ్లాక్ చేస్తే భారత్‌కు నష్టమేంటి?

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications