IT News: కాలం ఎప్పుడూ ఒక్కరికే అనుకూలంగా ఉండదు. ఇది టెక్కీల విషయంలో మరోసారి ఫ్రూవ్ అయ్యింది. దిగ్గజ టెక్ కంపెనీలు తమ కార్యాచరణ మార్పులతో చివరికి తాము అనుకున్నదే సాధించటంలో సఫలమయ్యాయి.
కరోనా మహమ్మారి సమయంలో ఐటీ ఉద్యోగులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఆ సమయంలో చాలా మంది మూన్‌లైటింగ్ ద్వారా ఏకకాలంలో రెండు మూడు ఉద్యోగాలు చేయటంతో కంపెనీలు నైతిక ఉల్లంఘన కింద వారిని తొలగించాయి. పైగా ఇది ఉద్యోగుల ఉత్పాదకత, ఆసక్తి సంఘర్షణ, డేటా ఉల్లంఘనలకు కారణమౌతుందని ఆందోళవ వ్యక్తం చేశారు.

ఇండస్ట్రీ మాట..:అయితే ప్రస్తుతం 70 శాతం మేర తగ్గినట్లు టాప్ ఐటీ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. కంపెనీలు హైబ్రిడ్ విధానంలో వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావటాన్ని తప్పనిసరి చేయటం దీనికి తోడ్పడిందని చెప్పారు. అలాగే కరోనా తర్వాత డిజిటల్ నైపుణ్యాల కోసం డిమాండ్ పెరిగింది. ఒకేసారి రెండు ఉద్యోగాలు చేపట్టడంపై ఐబీఎమ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, ఇన్ఫోసిస్ తమ విముకతను వెల్లడించాయి.
పెరిగిన ట్రాన్ఫరెన్సీ..:ఏడాది క్రితం కంటే ఇప్పుడు మూన్‌లైటింగ్ 70-80% తగ్గుదల ఉంది. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌లు, వెబ్‌సైట్ డిజైనర్లు, UX స్కిల్‌సెట్‌లు అవసరమయ్యే ప్రాజెక్ట్‌లు లేకపోవడం వల్ల కేసులు తగ్గుముఖం పట్టాయని స్టాఫింగ్ కంపెనీ ఎక్స్‌ఫెనోలో వర్క్‌ఫోర్స్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ హెడ్ ప్రసాద్ తెలిపారు. కంపెనీలు సైతం ప్రస్తుతం ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు చేపడుతున్నాయని వెల్లడైంది. అలాగే కంపెనీలు సైతం ట్రాన్పరెన్సీని పెంచటంతో ఉద్యోగులు తమకు రెండో ఉద్యోగం ఉన్నట్లయితే వాటి వివరాలను ముందుగానే వెల్లడిస్తున్నారని తెలిసింది.


Click it and Unblock the Notifications