RBI Repo Rate: వాస్తవానికి గడచిన మానిటరీ పాలసీలో రిజర్వు బ్యాంక్ అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ని అనుకరించి వడ్డీ రేట్లను తగ్గిస్తుందని తొలుత అందరూ భావించారు. అయితే ఆ సమయంలోనే ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావటంతో ద్రవ్యోల్బణం గణనీయంగా దేశంలో పెరిగింది. అయితే ఇప్పుడు అందరి చూపులో డిసెంబర్ సమావేశంపై పడింది.
ఆర్థిక వృద్ధిని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్‌లో కీలక పాలసీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం ఓ మోస్తరుగా ఉంటుందని అంచనా. సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.49 శాతానికి పెరగగా.. ప్రస్తుత త్రైమాసికంలో ఇది 4.9 శాతానికి తగ్గుతుందని తెలుస్తోంది. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.6 శాతానికి తగ్గవచ్చని నివేదిక పేర్కొంది. 2019 నుంచి వరుసగా 10 సమావేశాల్లో అత్యధిక రేట్లను చూస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వచ్చే త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని అంచనాలను పంచుకున్నారు. గత మానిటరీ పాలసీలో ఆర్బీఐ తన వైఖరిని తటస్థానికి మార్చుకుంది.

ఇప్పుడు ఆర్థికవేత్తలు వృద్ధిలో కనిష్ట మందగమనాన్ని ఆశిస్తున్నందున రేటు తగ్గింపుకు బలమైన అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో రాబోయే సమావేశంలో వడ్డీ రేట్లపై చేసిన సర్వేలో మెగారిజీ ఆర్థిక వేత్తలు రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చని భావిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా. అంచనా వేసిన ద్రవ్యోల్బణం 2026 ప్రారంభంలో రిజర్వు బ్యాంక్ మోడరేట్ లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని, దీని వలన సెంట్రల్ బ్యాంక్ రేట్లు తగ్గించడానికి చాలా తక్కువ అవకాశాన్ని ఉంచుతుందని ఆర్థికవేత్త మిగ్యుల్ చాంకో అన్నారు.
ప్రస్తుతం నిర్వహించిన పోల్ ప్రకారం డిసెంబరులో రేటు తగ్గింపు తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ రేట్ల తగ్గింపును కొనసాగించవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ తమ రేట్లను కనీసం 50 బేసిస్ పాయింట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. మానిటరీ పాలసీ రూపకర్తలు అస్థిరమైన ఆహార ధరలు, వినియోగదారుల బాస్కెట్ ఫండమెంటల్స్ ద్వారా తమ జాగ్రత్తను నొక్కిచెబుతున్నారు. కాబట్టి ద్రవ్యోల్బణం డైనమిక్స్ నియంత్రణలో ఉందని బ్యాంక్ విశ్వసించే అవకాశం ఉందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ ఆర్థికవేత్త అలెగ్జాండ్రా హర్మాన్ నివేదికలో పేర్కొన్నారు.
More From GoodReturns

GR RBI MPC Poll: ఏప్రిల్లో వడ్డీ రేట్ల కోత ఉండదు..ఇరాన్-అమెరికా యుద్ధంతో RBI వేచి చూసే వ్యూహం..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications