Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!
దేశవ్యాప్తంగా వాహనదారులకు ఒకవైపు ఊరట, మరోవైపు ఆందోళన కలిగించే వార్తలు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గురువారం పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ. 13 నుండి రూ. 3 కి తగ్గించింది. అలాగే డీజిల్‌పై ఉన్న రూ. 10 పన్నును పూర్తిగా సున్నాకి చేర్చింది. అయితే ఈ భారీ పన్ను కోత తర్వాత కూడా సామాన్యులకు బంకుల వద్ద పెట్రోల్ ధరల (Petrol Prices) లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో, ప్రభుత్వ రంగ చమురు సంస్థల (OMCs) నష్టాలను పూడ్చడానికే ఈ పన్ను తగ్గింపు నిర్ణయం దోహదపడుతోంది.

నేటి పెట్రోల్, డీజిల్ ధరలు (మార్చి 27, 2026)..
ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీ (IOC), బీపీసీఎల్ (BPCL), హెచ్‌పీసీఎల్ (HPCL) తమ ధరలను ఈ క్రింది విధంగా స్థిరంగా ఉంచాయి..
- హైదరాబాద్: ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ.107.46 ఉండగా, డీజిల్ ధర రూ.95.70 గా ఉంది.
- న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పెట్రోల్ లీటరుకు రూ.94.77, డీజిల్ రూ.87.67 కు లభిస్తోంది.
- ముంబై: ఆర్థిక రాజధానిలో పెట్రోల్ ధర రూ.103.54 కాగా, డీజిల్ ధర రూ.90.03 గా నమోదైంది.
- బెంగళూరు: ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ.102.92 , డీజిల్ ధర రూ.90.99 గా ఉంది.
- చెన్నై: తమిళనాడు రాజధానిలో పెట్రోల్ రూ.100.84, డీజిల్ రూ.92.39 పలుకుతోంది.
- కోల్‌కతా: ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ.105.45 ఉండగా, డీజిల్ రూ.92.02 గా ఉంది.
- అహ్మదాబాద్: గుజరాత్ నగరంలో పెట్రోల్ లీటరుకు రూ.94.29, డీజిల్ రూ.89.95 కు అందుబాటులో ఉంది.
ప్రైవేట్ బంకుల్లో పెరిగిన భారం
ప్రభుత్వ సంస్థలు ధరలను స్థిరంగా ఉంచినప్పటికీ, ప్రముఖ ప్రైవేట్ చమురు సంస్థ 'నయారా ఎనర్జీ' (Nayara Energy) తన ధరలను పెంచింది. పెట్రోల్‌పై రూ. 5 , డీజిల్‌పై రూ. 3 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడానికే ఈ పెంపు అని సంస్థ స్పష్టం చేసింది. అయితే రిలయన్స్-బీపీ (Jio-bp) వంటి సంస్థలు ప్రస్తుతానికి పాత ధరలనే కొనసాగిస్తున్నప్పటికీ, ప్రతి లీటరుపై భారీగా నష్టపోతున్నట్లు సమాచారం.
రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి విలువ
ఇంధన ధరల ఆందోళనల మధ్య భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే చారిత్రక కనిష్టానికి పడిపోయింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి విలువ 94.15 మార్కుకు చేరుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన ఫిబ్రవరి 28 నుండి ఇప్పటివరకు రూపాయి విలువ 3.5 శాతం క్షీణించింది. ముడి చమురు ధరలు బ్యారెల్ $100 దాటి ఉండటం , డాలర్‌కు విపరీతమైన డిమాండ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.
రూపాయి బలహీనపడటం వల్ల మనం దిగుమతి చేసుకునే ముడి చమురు ధర మరింత ప్రియం అవుతుంది. ఇది భవిష్యత్తులో పెట్రోల్ ధరల (Petrol Prices) పై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం చమురు సంస్థలు , ప్రభుత్వం ఈ భారాన్ని భరిస్తున్నప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడకపోతే సామాన్యుడిపై భారం పడక తప్పదు.


Click it and Unblock the Notifications