ప్రస్తుతం సోషల్ మీడియాలో విడాకులు (Divorce), భరణం (Alimony) అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హై-ప్రొఫైల్ విడాకుల కేసులు పెరగడం, కోర్టులు భరణం విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో సామాన్యుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. "నాకు ఆదాయం లేదు", "నాకు వేరే బాధ్యతలు ఉన్నాయి" అని చెప్పి తప్పించుకోవాలని చూసే భర్తలకు ఇటీవలి తీర్పులు గట్టి షాక్ ఇస్తున్నాయి. అసలు భరణం గురించి దేశంలో ఉన్న రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రెండో భార్య ఉంటే మొదటి భార్యకు భరణం అక్కర్లేదా?
ఇటీవల ఒక కేసులో భర్త వింత వాదనను తెరపైకి తెచ్చాడు. "నాకు రెండో పెళ్లయింది, ఇప్పుడు నాకు ఇంకో కుటుంబం ఉంది.. కాబట్టి మొదటి భార్యకు భరణం చెల్లించే ఆర్థిక శక్తి నాకు లేదు" అని కోర్టులో మొరపెట్టుకున్నాడు. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
"రెండో పెళ్లి అనేది భర్త వ్యక్తిగత నిర్ణయం. అది మొదటి భార్యకు భరణం చెల్లించకపోవడానికి సాకు కాకూడదు." అని స్పష్టం చేసింది. భర్త తన ఆదాయంలో మొదటి భార్య గౌరవప్రదంగా బ్రతకడానికి అవసరమైన మొత్తాన్ని కచ్చితంగా కేటాయించాలని ఆదేశించింది.
పని చేసే మహిళలకు (Working Women) భరణం వస్తుందా?
ఇది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. 2025-26లో వచ్చిన పలు తీర్పుల ప్రకారం..
- భార్యకు ఉద్యోగం ఉన్నంత మాత్రాన భరణం నిరాకరించలేము. అయితే, ఆమె సంపాదన, భర్త సంపాదన మధ్య ఉన్న వ్యత్యాసాన్ని (Income Disparity) కోర్టు గమనిస్తుంది.
- ఒకవేళ భార్య సంపాదన భర్త సంపాదనతో సమానంగా ఉన్నా లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నా, భరణం మొత్తాన్ని కోర్టులు భారీగా తగ్గిస్తున్నాయి లేదా నిరాకరిస్తున్నాయి.
- వివాహ సమయంలో భార్య అనుభవించిన 'లైఫ్ స్టైల్'ను విడాకుల తర్వాత కూడా కొనసాగించేలా భరణం ఉండాలని బొంబాయి హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది.
భరణం ఎంత ఇవ్వాలి?
భారత చట్టాల ప్రకారం భరణం లెక్కించడానికి నిర్దిష్ట ఫార్ములా లేనప్పటికీ, కోర్టులు ప్రధానంగా 3 సూత్రాలను పాటిస్తాయి...
- ఆదాయంలో శాతం: సాధారణంగా భర్త నికర ఆదాయంలో 25% నుండి 33% వరకు నెలవారీ భరణంగా నిర్ణయిస్తారు.
- వన్-టైమ్ సెటిల్మెంట్: నెలకు కాకుండా ఒకేసారి ఇచ్చే భరణం (Permanent Alimony) అయితే భర్త ఆస్తులు, భవిష్యత్తు ఆదాయాన్ని బట్టి రూ. 50 లక్షల నుండి కోట్లలో ఉండవచ్చు.
- ఆస్తి సమానత్వం కాదు: భర్త ఆస్తి రూ. 500 కోట్లు ఉంటే.. భార్యకు అందులో సగం ఇవ్వాలని రూల్ లేదు. భార్య గౌరవంగా బ్రతకడానికి ఎంత అవసరమో అంతే ఇప్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భర్తలకు కూడా భరణం పొందే హక్కు ఉందా?
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. హిందూ వివాహ చట్టం ప్రకారం.. భర్త శారీరకంగా అశక్తుడై లేదా సంపాదన లేని పక్షంలో భార్య సంపాదనపరురాలు అయితే భర్త కూడా భరణం కోరవచ్చు.
మొత్తంగా పెరుగుతున్న జీవన ప్రమాణాల దృష్ట్యా భరణం కేసులు ఇప్పుడు కేవలం చట్టపరమైన అంశాలే కాదు, ఆర్థిక ప్రణాళికలో (Financial Planning) భాగమైపోయాయి. అందుకే "ప్రీ-నప్షియల్ అగ్రిమెంట్స్ (prenuptial agreement)" పై కూడా ఇప్పుడు మన దేశంలో చర్చ మొదలైంది. ఏది ఏమైనా భరణం అనేది భార్యను ఇబ్బంది పెట్టడానికో లేదా భర్తను రోడ్డున పడేయడానికో కాదు. విడాకుల తర్వాత ఇద్దరి భవిష్యత్తు మంచిగా ఉండేలా అది ఉపయోగపడుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే కోర్టులు సందర్భాన్ని బట్టి తీర్పులు ఇస్తున్నాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications