layoffs: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల పలు కంపెనీలు లేఆఫ్ లు ప్రకటించక తప్పని స్థితి నెలకొంది. ఇప్పటివరకు లక్షల కొద్దీ ఉద్యోగులు రోడ్డున పడాల్సి వచ్చింది. పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకున్న తరుణంలో కొత్తగా మరికొన్ని సంస్థలు ఉద్యోగుల కోతను ప్రకటిస్తున్నాయి. ఫ్రెషర్స్ గుండెల్లో గుబులు రేపుతున్నాయి. అయితే సిబ్బంది తొలగింపుల తీవ్రత ఎంతగా ఉంది అనేది అర్థం చేసుకోవడానికి ఇప్పుడు చెప్పబోతున్న లెక్కలే నిదర్శనం.

లేఆఫ్ లకు తోడు జీతాల తగ్గింపు:
లేఆఫ్ ల మోత కేవలం ఒక్క ఐటీ రంగానికే పరిమితం కాలేదు. మీడియా, ఫ్యాషన్, రిటైల్, బ్యాంకింగ్ సహా పలు సెక్టార్లకు సైతం విస్తరించింది. 2022 ఏడాది చివరి నుంచి వీటికి బీజం పడింది. అయితే గత రెండు నెలలను నిశితంగా గమనిస్తే, ప్రతిరోజూ దాదాపు 2,700 మంది కొలువులు కోల్పోయినట్లు చెబుతున్న గణాంకాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. గతేడాది 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోగా, ఈ రెండు నెలల్లోనే 1.5 లక్షల సిబ్బందిపై వేటు పడింది. వీటికి అదనంగా, కొన్ని సంస్థలు ఉన్న ఉద్యోగుల జీతాలనూ తగ్గించడం మొదలుపెట్టాయి.

ITతో పాటు ఇతర రంగాలూ సై..
వివిధ దేశాల్లో పెరుగుతున్న ద్రవ్యోల్భణం, అమెరికా-చైనా మధ్య ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ అనంతర ఆర్థిక మందగమనం వెరసి ఉద్యోగుల పాలిట శాపాలయ్యాయి. టెక్ సంస్థలతో పాటు CNN, మెకిన్సే, మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, H&M వంటి బహుళ జాతి సంస్థలు సైతం ఉద్యోగులను తొలగిస్తూ.. తమ ఆర్థిక స్థితిని కాపాడుకుంటున్నాయి. ఈ పరిస్థితి కేవలం విదేశాలకే పరిమితం కాలేదు. ఒక్క భారత్ లోనే కేవలం స్టార్టప్లే 22 వేలకు పైగా ఉద్యోగాల్లో కోత విధించి షాక్ ఇచ్చాయి. ఈ పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయోనని ఎదురుచూడటం మినహా ఏమీ చేయలేకపోతున్నామని ఉద్యోగార్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

మరో పది రెట్టు ఉద్యోగాలకు ఎసరు?
ఆయా కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి వ్యయాలను తగ్గించుకోవడంపై దృష్టి పెట్టడంతో ఈ పరిస్థితి నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. వివిధ సంస్థల్లో ఈ తరహా వైఖరి పెరుగుతున్నందున తొలగింపులు ఇప్పట్లో మందగించే అవకాశం కనిపించడం లేదని భావిస్తున్నారు. కేవలం ఉద్యోగులను మాత్రమే తీసేస్తున్నారు అనుకుంటే పొరపాటే అవుతుంది. తన కాఫ్టేరియాను శుభ్రపరచే రోబోట్లను సైతం గూగుల్ వదలలేదు. అయితే ఇప్పటివరకు తొలగించిన వారి కంటే 10 రెట్లు మరింత ఎక్కువ మందిని తీసివేయాలని.. కంపెనీకి చెందిన ఓ ప్రముఖ ఇన్వెస్టర్ సూచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూడాలి మరి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications