మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులా: నెత్తిన పాలు పోసిన మోడీ సర్కార్: ఆ స్కీమ్ గడువులో చిన్న ట్విస్ట్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు వినిపించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనాన్ని కల్పించే, ఊరట కలిగించే శుభవార్త అది. చాలా రోజుల నుంచి ఉద్యోగులు కోరుకుంటోన్నది కూడా అదే. వారి అభిప్రాయాలు, అభీష్టాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) క్లెయిమ్‌లు, బిల్లులను దాఖలు చేయడానికి ఉద్దేశించిన గడువును పొడిగించింది. మరో నెలరోజుల పాటు వెసలుబాటును కల్పించింది.
తాజాగా పొడిగించిన గడువు ప్రకారం.. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఎల్టీసీ క్లెయిమ్స్, బిల్లులను ఈ నెల 30వ తేదీ వరకు సమర్పించడానికి వీలు ఉంది. ఇందులో చిన్న ట్విస్ట్ పెట్టింది. ఆ క్లెయిమ్స్ గానీ, బిల్లులు గానీ మార్చి 31వ తేదీ లోపునకు చెందినవి మాత్రమే ఉండాలి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1వ తేదీ, ఆపై నమోదైన క్లెయిమ్స్, బిల్లులను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదు. ఎల్టీసీ నిబంధనలకు లోబడి ఉన్న బిల్లులు, క్లెయిమ్స్ అన్నీ 2020-2021 ఆర్థిక సంవత్సరానికి చెందినవి.. మార్చి 31వ తేదీలోపే ఉండాలని సూచించింది. ఆన్‌లైన్ కొనుగోళ్లకు కూడా ఇదే విధానం వర్తింపజేసింది.

ఉద్యోగులు తమ ఎల్టీసీ క్యాష్ వోచర్లకు సంబంధించిన క్లెయిమ్స్, బిల్లులను సమర్పించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు కేంద్ర ప్రభుుత్వం గుర్తించింది. దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణణలోకి తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడువును మరో నెల రోజుల పాటు అంటే.. ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ఆఫీస్ మెమొరాండాన్ని సర్క్యులేట్ చేసింది. ఆన్‌లైన్ కొనుగోళ్లతో సహా బిల్లులన్నీ మార్చి 31వ తేదీ లోపునకు చెందినవి మాత్రమే ఉండాలని పేర్కొంది. అలా ఉన్న వాటికే పొడిగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.



Click it and Unblock the Notifications