Maruti Suzuki: దేశంలోని కార్ తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సంచల నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం, పెరిగిన ముడి సరకు ధరలతో వ్యయ ఒత్తిడి పెరిగిందని కంపెనీ పేర్కొంది.
ఈ కారణంగా జనవరి 2024లో కార్ల ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకీ నవంబర్ 27న తెలిపింది. కంపెనీ ఖర్చును తగ్గించడానికి, పెరుగుదలను భర్తీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో కొంత ఖర్చులను మార్కెట్లోని వినియోగదారులకు పాస్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. దేశంలో ఇతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా కొనసాగుతున్న మారుతీ ఇదే విషయాన్ని తన రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో పేర్కొంది.

ఎంట్రీ-లెవల్ చిన్న కారు ఆల్టో నుంచి మల్టీ-యుటిలిటీ వెహికల్ ఇన్విక్టో వరకు అనేక వేరియంట్లను కంపెనీ విక్రయిస్తోంది. వీటి విక్రయ ధరలు రూ.3.54 లక్షల నుంచి ప్రారంభమై రూ.28.42 లక్షల మధ్య వివిధ ధరల శ్రేణిని కలిగి ఉన్నాయి. అయితే ఏఏ వేరియంట్లపై ఎంత శాతం రేట్లను పెంచాలనుకుందనే వివరాలను కంపెనీ ఇంకా బయటపెట్టలేదు.అయితే మోడళ్లను బట్టి వాటి ధరల పెంపులో వ్యత్యాసం ఉంటుందని మాత్రం మారుతీ స్పష్టం చేసింది.
రేట్ల పెరుగుదల వివిధ మోడళ్లకు మారుతుందని మారుతీ వెల్లడించింది. ఈ ఏడాది ఆటో అమ్మకాలు పుంజుకున్న తరుణంలో అక్టోబర్ మాసంలో మారుతీ సుజుకీ అత్యధికంగా 1,99,217 యూనిట్ల విక్రయాన్ని నమోదు చేసింది. ఇది ఏడాది ప్రాతిపదికన 19 శాతం అధికం. 2022 అక్టోబరులో కంపెనీ వాహన విక్రయాల సంఖ్య 1,67,520గా ఉంది. అయితే భారతదేశంలో కంపెనీ అక్టోబర్ అమ్మకాల సంఖ్య 21 శాతం పెరిగి 1,77,266 వద్ద ఉంది.
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏడాది ప్రాతిపదికన స్వతంత్ర నికర లాభం 80.3 శాతం పెరుగుదలను నమోదు చేసింది. దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ గత ఏడాది ఇదే కాలానికి పన్ను తర్వాత లాభం రూ.2,061.5 కోట్లుగా నమోదు చేసింది. దిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే రెండవ త్రైమాసికంలో 23.8 శాతం పెరిగి రూ.37,062 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications